సీమాంధ్ర చీఫ్ బొత్స: టికి పొన్నాల, దామోదరకి ప్రచారం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర పిసిసి అధ్యక్షులుగా నియమితులైనట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రంలోగా రెండు పిసిసిలను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అధిష్టానం రెండు పిసిసిల కోసం భారీగా కసరత్తు చేసింది. సీమాంధ్ర పిసిసి చీఫ్‌గా బొత్సను చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రాంతానికి రెండు పిసిసి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటలలోగా ఆ పేర్లు వెల్లడించే అవకాశముంది.

తెలంగాణకు అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబును, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెసు తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దామోదర రాజనర్సింహ పేరు ఖరారైందని తెలుస్తోంది.
కాగా, డిగ్గీతో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం డిగ్గీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
ఎన్నికల సంఘం కార్యదర్శితో లగడపాటి
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను లగడపాటి రాజగోపాల్ కలిశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కిరణ్ కొత్త పార్టీ పోటీ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకీ ప్రాధాన్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications