దౌర్జన్యంగా: రాజధానిపై బొత్స, సుజన వివరణ
విజయవాడ: రాజధాని కోసం రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సోమవారం ఆరోపించారు. మద్యం సిండికేట్లతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారని, అందుకే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
రాజధాని భూముల సేకరణ ఏర్పాటు ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి తాము వ్యతిరేకమని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. రైతుల అంగీకారంతోనే భూ సమీకరణ జరగాలన్నారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే సాధికారిక కార్పొరేన్ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. కార్పొరేషన్‌కు, భూ సేకరణకు సంబంధం లేదన్నారు. లాండ్ పూలింగ్ వల్ల రైతుకు నష్టం జరుగుతుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పు బట్టారు.
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సాధికారిక కార్పొరేషన్‌కు, భూ సేకరణకు సంబంధం లేదని, సాధికారిక కార్పొరేషన్ అంటే రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా బ్యాంకులలో గానీ, రుణ మాఫీ, ఇన్పురెన్స్, విత్తనాలు తదితర సమస్యలు వచ్చినా రైతులను ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిందే అన్నారు.












Click it and Unblock the Notifications