శత్రుచర్లకు బోత్స చెక్.. వ్యూహం వెనుక, రామ్మోహన్-అచ్చెన్నలూ షాకిచ్చారు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు మంగళవారం నాడు కలెక్టరేట్‌లో టిడిపి తరఫున నామినేషన్ వేశారు.
శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు మంగళవారం నాడు కలెక్టరేట్‌లో టిడిపి తరఫున నామినేషన్ వేశారు. ఆయన వెంట జిల్లా ఇంచార్జి మంత్రి పరిటాల సునీత, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కూన రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష్ ఉన్నారు.
నామినేషన్ ఘట్టానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో సమయం పూర్తయ్యేసరికి మరో ఇద్దరు ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే శత్రుచర్లను ఏకగ్రీవం చేసేందుకు టిడిపి నేతలు విఫలయత్నం చేశారు.

బొత్స చక్రం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయనగరం జిల్లా కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ చక్రం తిప్పడం వల్లే ఏకగ్రీవం కాలేదని అంటున్నారు. బొత్స వ్యూహాత్మకంగా కాపు సామాజికవర్గం వారిని శత్రుచర్ల పైన పోటీలోకి దించారని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన మామిడి శ్రీకాంత్ కాపు సామాజిక వర్గం నేత. ఆయన బొత్స బంధువు అని కూడా తెలుస్తోంది.

రెబల్‌గా..
అంతకుముందు కూడా మరో టిడిపి నేత కోళ్ల అప్పల నాయుడుతో రెబల్‌గా పోటీ చేయిద్దామనుకున్నప్పటికీ.. చంద్రబాబు, టిడిపి నేతలు అప్రమత్తమై ఆయనకు డీసీసీ చైర్మన్ పదవి హామీ ఇచ్చారు. దీంతో ఆయన తగ్గారని అంటున్నారు.

బొత్స వ్యూహం వెనుక..
అయితే, కోళ్ల అప్పలనాయుడుతో నామినేషన్ ఉపసంహరింప చేసిన టిడిపి నేతలు.. ఏకగ్రీవం అయ్యేలా మాత్రం చేయలేకపోయారు. టిడిపి అడుగులకు బొత్స.. కాపు నేతతో చెక్ చెప్పారు. దీంతో పోటీ అనివార్యం అవుతోంది.
ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి మామిడి శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేయడం వెనుక బొత్స తన జిల్లాలో శత్రుచర్లకు గల మూడు అసెంబ్లీ సిగ్మెంట్‌లైన కురపాం, పార్వతీపురం, నాగూర్‌లో టిడిపి బలం మరింత పెరగకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడలో భాగమని అంటున్నారు.

బాబాయ్ - అబ్బాయ్‌ల షాక్
మరోవైపు, టిటిపి కంచుకోట సిక్కోలులో ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి పిఎసిఎస్ అధ్యక్షులు శోభనబాబు అందరికంటే ముందుగా నామినేషన్ దాఖలు చేసారు. టిడిపికి విధేయుడైనప్పటికీ, సిఎం ప్రకటించిన అభ్యర్థిపై మరో టిడిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం వెనుక బాబాయ్-అబ్బాయ్‌ల రాజకీయ మంత్రాంగం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు.
శత్రుచర్ల ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవడానికి ఇదో రకమైన ఎత్తుగడని, అందుకు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ సహకారం, మౌనం వెనుక అయిష్టంగా ఉన్న జిల్లా నేతలకు కొంత ఊరట ఇచ్చేలా ఉంటోందన్న భావనతోనే ఏకగ్రీవానికి మోకాలడ్డే ప్రయత్నం టిడిపి నేతలే చేసారంటూ విమర్శలు కూడా శత్రుచర్ల అనుచరులు నోట వినిపిస్తున్నాయంటున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications