చొక్కా పట్టుకుని నిలబెడతాం-జగన్ కు హోదాపై బొత్స వార్నింగ్..!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ సంప్రదాయ ప్రసంగం చేశారు. అసెంబ్లీ, మండలి సభ్యుల ఉమ్మడి భేటీలో గవర్నర్ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యాక మాత్రం జగన్ కు విపక్ష నేత హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.

అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. ఇందులో మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. జగన్ కు విపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయని, ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షమని బొత్స తెలిపారు. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందన్నారు. ప్రజల గొంతుక వినబడాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు.

botsa Satyanarayana warns to go to public if lop status not give to ys jagan in ap assembly

ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందేనని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందుకే తాము
ప్రతిపక్ష హోదా కోరుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వం స్పందన బట్టి తమ స్పందన ఉంటుందన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాత్రం జనంలోకి వెళ్తామని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలబెడతామన్నారు. మిర్చి రైతుల సమస్యలపై జగన్ స్పందించాకే ప్రభుత్వం స్పందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+