టిపై ధిక్కరించలేదు: కిరణ్‌కు బొత్స అండ, బాబుపై ఫైర్
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని మాత్రమే కోరారన్నారు. రాష్ట్ర విభజన కోరిన వారిలో ప్రథముడు చంద్రబాబు నాయుడే అని విమర్శించారు. 2009 నిర్ణయం నుండి కొందరు వెనక్కి వెళ్లారని చెప్పారు.

ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోవద్దని, సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని సీమాంధ్ర కాంగ్రెసు నేతలతో చెబుతున్నారని తెలిపారు. సమ్మె, ఆందోళనలతో ఆర్టీసితో పాటు అందరూ నష్టపోతారని, ప్రజలు ఇబ్బందురు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అధిష్టానానికి వివరించినట్లు చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో చంద్రబాబు వేదిక పంచుకోవడం ఆయన ఇష్టమని అయితే, అదే వేదిక పైన యూపిఏ పాలన అవినీతిమయమని, ఎన్డీయో పాలన గొప్పదని పొగడటం విడ్డూరమన్నారు. మోడీ మంత్రివర్గంలోని పలువురు జైల్లో ఉన్నారని, ఇంకొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆ విషయం బాబుకు తెలియదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications