ఇది ఆశ్చర్యం కలిగించింది: కిరణ్‌కు బొత్స ఘాటు లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ సోమవారం లేఖ రాశారు. శాసన మండలి విప్‌లు, ఎమ్మెల్సీల నియామకాన్ని పెండింగులో ఉంచడాన్ని ఆయన తన లేఖలో ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సున్నిత పరిస్థితులు నెలకొన్న సమయంలో విప్‌లను నియమించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని రాశారు.
నంది ఎల్లయ్య, రత్నాబాయి, కంతేటి సత్యనారాయణలను మండలికి నామినేట్ చేయాలని అధిష్టానం ఆదేశించినా వాటిని పెండింగులో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీలో బలహీనవర్గాలను విస్మరించడం ఎలా సమర్థించుకోగలమని అందులో పేర్కొన్నారు.

కాంగ్రెసు పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, అలాంటి పార్టీలోనే విస్మరించడం ఎంత వరకు సమంజసమన్నారు. మండలికి నామినేట్ చేయాలన్నా వారి పేర్లు పెండింగులో పెట్టడం సరికాదన్నారు. పదవుల భర్తీలో పరిగణలోకి తీసుకోవాల్సిన సామాజిక సమతుల్యాన్ని పట్టించుకోలేదన్నారు. దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
పార్టీకి ప్రయోజనం లేని నియామాకాలు సరికాదన్నారు. మండలి విప్‌ల నియాకమం సరిగా లేదన్నారు. రంగారెడ్డి, రెడ్డప్పరెడ్డిలను మాత్రమే విప్‌లుగా నియమించడం ఎంత వరకు సమంజసమన్నారు. కాగా, బొత్స లేఖతో వారిద్దరి మధ్య విభేదాలు మాత్రమే కాకుండా, పార్టీలో రానున్న కుదుపుకు ఇది ఒక సంకేతమంటున్నారు.












Click it and Unblock the Notifications