దేవరగట్టు కర్రల సమరంలో బాలుడి దుర్మరణం
కర్నూలు: కర్నూలు జిల్లా దేవరకద్ర కర్రల సమరం పదేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకుంది. ఈ ఏడాది పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దేవరగట్టులో ఉద్రిక్తత సడలలేదు. సమయానికి గ్రామస్థులు కర్రలు చేత బూని సమరానికి సిద్ధపడ్డారు. పూనకం వచ్చినట్లుగా ఊగిపోతు కర్రలు పట్టుకుని కొందరు కాగడాలు పట్టుకుని మరికొందరు పరుగులు పెట్టారు.
తీవ్రమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియని వాతావరణంలో కర్రలు దూసుకున్నారు. తలలు పగిలాయి. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. నలబై మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా, బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఏం జరిగినా వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఏటా దేవరగట్టులో బన్నీ ఉత్సవాల పేరిట కర్రల సమరం జరుగుతుంది.












Click it and Unblock the Notifications