చంద్రబాబుతో బోయపాటి భేటీ, పవిత్ర సంగమంపై ప్రజెంటేషన్! పదిరోజుల్లో తుది నిర్ణయం?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బుధవారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భేటీ అయ్యారు. పవిత్ర సంగమం వద్ద నిర్మాణాలకు సంబంధించిన నమూనాలపై సీఆర్డీఏ సమావేశంలో బోయపాటి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బుధవారం రాత్రి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిలో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలివున్న మరో దేవాలయ రూపకల్పనకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సీఆర్డీఏ సమావేశంలో బోయపాటి శ్రీను ముఖ్యమంత్రికి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ ప్రజెంటేషన్‌లో విజయవాడ పవిత్ర సంగమం వద్ద వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాల నమూనాలని, దశావతారాల థీమ్‌తో రూపకల్పన చేసినట్టు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి అందిస్తున్నామని, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
బోయపాటి శ్రీను అందించిన ప్రాజెక్టు నమూనా గురించి ఆగమ శాస్త్ర నిపుణులు, టీటీడీ వేద పండితులను సంప్రదించి మరో పదిరోజుల్లో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications