Karnool: ప్రాణం తీసిన నగ్న వీడియోలు.. అస్సలు ఏం జరిగిందంటే..?
కర్నూలులో ప్రియురాలి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన ప్రియడు.
ప్రపంచంలో సాంకేతికత ఎంత పెరుగుతుందో... అంతే స్థాయిలో చాలా మంది పెడదోప పడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ తక్కువ ధరకే రావడంతో వీటి వినియోగం భారీగా పెరిగింది. అయితే కొంత దీన్ని సద్వినియోగం చేసుకోగా.. మరికొంత దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూడడం పెరిగిపోయింది. ఇలా చాలా అశ్లీల చిత్రాలు చూస్తూ పెడదారి పడుతున్నారు.

ఫోన్ లో రికార్డు
తాజాగా కర్నూలులో ఓ వ్యక్తి తన లవర్ నగ్న వీడియోలు తన రికార్డు చేశాడు. ఇవి కాస్త మరొక వ్యక్తి చేరడంతో ఒకరి ప్రాణాలు పోయాయి. స్థానిక బాలాజీనగర్‌కు చెందిన ఎరుకలి దినేశ్ డిగ్రీ చేస్తున్నాడు. ఇతను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. దినేశ్ కు పూల అలంకరణ పనిచేసే మల్లెపోగు మురళీకృష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. దినేశ్ తన లవర్ నగ్న వీడియో తన ఫోన్ రికార్డ్ చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత దినేశ్ మురళీకృష్ణ వద్దకు వచ్చాడు. వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మురళీ దినేశ్ మొబైల్ చూడాగా అందులో అతని లవర్ నగ్న వీడియోలు కనిపించాయి.

బ్లాక్ మెయిల్
దీంతో మురళీ దినేశ్ తెలియకుండా ఆ వీడియోలను తన మొబైల్ కు పంపించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత దినేశ్ ప్రియురాలికి మురళీ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. చెప్పినట్లు చేయకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించారు.

హత్యకు ప్లాన్
ఈ విషయం తెలుసుకున్న దినేష్ కోపంతో రగిలిపోయాడు. స్నేహితుడికే ద్రోహం చేస్తావా.. అంటూ మురళీపై కోపం పెంచుకున్నాడు. మరో స్నేహితుుడ కిరణ్ కుమార్ తో కలిసి మురళీకృష్ణ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అప్పటికే మురళీకృష్ణ శివమాల ధరించాడు. అయినా తన నిర్ణయం మార్చుకోని దినేశ్.. జనవరి 25న మురళీని దినేశ్, కిరణ్‌కుమార్‌లు బైక్‌పై ఎక్కించుకుని నగర శివారులోని పంచలింగాల ప్రాంతానికి తీసుకెళ్లారు.

కత్తితో పొడిచి
అక్కడ కాసేపు వీరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో దినేశ్ మురళీని పొడిచాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడేశారు. మురళీకృష్ణ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించారు. మృతుడి కాల్ డెటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దినేష్ ను విచారించగా.. హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. మృతదేహం కోసం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో గాలింపు చేపట్టారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications