లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం..!!
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణంతో లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. తారకరత్న కు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ బయల్దేరిన లోకేష్.. నివాళి అర్పించనున్నారు. అంత్యక్రియకలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉండనున్నారు. తారకరత్న మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లోకేష్ పేర్కొన్నారు.
బావా అంటూ ఆప్యాయంగా పిలిచే తారకరత్న గొంతు ఇక వినిపించదన్న విషయం బాధగా ఉందని చెప్పారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో పాల్గొంనేందుకు వచ్చిన తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. 23 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. శనివారం ఉదయం ఆరోగ్యం క్షీణించటం..రాత్రికి తారకరత్న కన్నుమూసినట్లు ప్రకటించారు.

తారకరత్న భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించారు. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరణవార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. 23 రోజులు మృత్యువు తో పోరాడి..చివరకు దూరమై తమ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక..లోకేష్ తారకరత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నేనున్నానంటూ తన వెంట నడిచిన తారకరత్న అడుగులు చప్పుడు ఆగిపోవటం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. తారకరతన్న మరణం తమ కుటుంబానికి.. పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ప్రేమ..స్నేహబంధం..బంధుత్వం కంటే ఎంతో గొప్పదని లోకేష్ తనకు తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా. తారకరత్న పార్థివదేహాన్ని ఈరోజు ఉదయానికి హైదరాబాద్, మోకిల లోని తన నివాసంలో ఉంచనున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచాలని ప్రాధమికంగా నిర్ణయించారు.
సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. తారకరత్న మరణ వార్తతో నందమూరి కుటుంబం విషాదంలో ఉంది. కుటుంబ సభ్యులంతా తారకరత్న నివాసానికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications