ఐ హేట్ లైఫ్... ఐ హేట్ మనీ అని రాసి బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఐ హేట్ లైఫ్... ఐ హేట్ మనీ అని కొత్త నోట్‌పై రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించాడు.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మోతుకూరి వంశీకృష్ణ(20) ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మిత్రులతో గదిలో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు.

హోటల్‌లో గది తీసుకుని...
శనివారం రత్రి ఏడు గంటలకు ఓ హోటల్‌లో అతను గది తీసుకున్నాడు. అతని గది నుంచి ఆర్డర్లు రాకపోవడంతో ఆదివారం సాయంత్రం హోటల్ నిర్వాహకులకు అనుమానం వచ్చింది.

సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ శవం
గదికి వెళ్లిన హోటల్ సిబ్బందికి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ వంశీకృష్ణ మృతదేహం కనిపించింది. గదిని పరిశీలించిన పోలీసులకు రెండు 200 రూపాయల కొత్త నోట్లు, టిష్యూ పేపర్‌పై రాసిన సూసైడ్ కనిపించాయి.

కొత్త నోట్లపై ఇలా రాశాడు
ఐ హేట్ మనీ... ఐ హేట్ మై లైఫ్ అని కొత్త నోట్లపై రాసి ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని,, తాను చనిపోయిన తర్వాత తమ ఇంటికి ఫోన్ చేసి చెప్పాలని సూసైడ్ నోట్‌లో రాశాడు. ఆ లేఖలో తన కుటుంబ సభ్యులను పేరుపేరునా ప్రస్తావించాడు.

63 వేల రూపాయల అప్పులున్నాయని...
తాను అప్పులు తీసుకున్న వివరాలను కూడా అతను రాశాు.. మొత్తం 63 వేల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పాపడు వంశీకృష్ణ తల్లి అతని బాల్యంలోనే మరణించింంది. తండ్రి ఇటీవలే ప్రమాదానికి గురయ్యాడు. అయితే, అతనికి ఏ విధమైన ఇబ్బందులు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని మిత్రులు అంటున్నారు.












Click it and Unblock the Notifications