వ్యాపారి కిడ్నాప్, సిసీటీవీ కెమెరాల్లో రికార్డు: విడుదల
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కిడ్నాప్ ఉదంతం సంచలనం రేపింది. ఆదర్శ్ ఇంటీరియర్స్ షాపు యజమాని లలిత్ కొఠారిని దుండగులు కిడ్నాప్ చేశారు. లలిత్‌కొఠారిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
విషయం తెలిసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాకినాడ నుంచి బయటికి వెళ్లే రోడ్లను అన్నింటినీ దిగ్బంధం చేశారు. దీంతో కిడ్నాపర్లు ఏడీబీ రోడ్డు దగ్గర వ్యాపారిని వదిలిపెట్టి పరారయ్యారు.
వ్యాపార లావాదేవీల్లో విభేదాలే ఈ కిడ్నాప్‌కు కారణంగా అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌పై వ్యాపారి లలిత్‌కొఠారి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే, కడప జిల్లాలోని యాదమర్రి మండలం లక్ష్మయ్యకండ్రిగ దగ్గర మంగళవారం ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications