ఓటేసిన కేసీఆర్, చూపించిన హరీష్ భార్య (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ లోకసభ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ శాసనసభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్వగ్రామం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

మొత్తంమీద నియోజకవర్గంలో 65.74శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలకంటే దాదాపు 12 శాతం పోలింగ్ ఈసారి తగ్గింది. కాగా తమ గ్రామాల్లో సౌకర్యాలు లేవని, ఓటింగ్‌ను బహిష్కరిస్తామని పెద్దపూరం, కుంచారంతండా, మర్‌కుక్ గ్రామాల ప్రజలు భీష్మించగా అధికారులు నచ్చచెప్పడంతో మధ్యాహ్నం వారు ఓటింగ్‌కు హాజరయ్యారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గంలో ఉదయంనుంచే పోలింగ్ మొదలైంది. మొత్తంమీద 69.49 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి ఇక్కడ గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బరిలోకి దిగలేదు. అప్పటి ఎన్నికల్లో నెగ్గిన టిడిపి అభ్యర్థి తంగిరాల ప్రభాకర రావు ప్రమాణస్వీకారానికి ముందే హఠాన్మరణం చెందడంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు.

ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

మెదక్ లోకసభ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1817 పోలింగ్ కేంద్రాల ద్వారా 65.74శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క ఈవిఎం, గజ్వేల్ నియోజకవర్గంలో రెండు ఈవిఎంలలో సాంకేతిక సమస్యలు నెలకొనగా బెల్ కంపెనీ ఇంజనీర్ల ద్వారా వాటిని మార్చడం జరిగిందన్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

పోలింగ్ సరళి తగ్గడంపై కలెక్టర్ స్పందిస్తూ సాధారణ ఎన్నికలంతా ఆసక్తి కనబర్చకపోవడం, పటాన్‌చెరు లాంటి పారిశ్రామిక ప్రాంతంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఉండి సెలవు ప్రకటించకపోవడంతో తక్కువగా ఓటింగ్ నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

వెల్ధుర్థి మండలం పెద్దపల్లి గ్రామంలో 10నుండి 20మంది వరకు ఓటర్లు ఓటు వేయకుండ నిలిపి వేసారని తన దృష్టికి రాగానే స్థానిక తహాశీల్ధార్‌ను అక్కడికి పంపి సమస్యను తెలుసుకొని ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రొత్సాహించామన్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించడంతో పాటు ప్రతి పోలింగ్ లోకేషన్లలో వీడియోగ్రాఫీ చేయించామన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవిఎంలను ఆయా నియోజకవర్గ కేంద్రాలకు తరలించి పటిష్ట పోలీస్ బందోబస్తు మద్య పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తున్నట్లు తెలిపారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

16న ఉదయం 7గంటల నుండి గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపుకు ఇప్పటికే ప్రథమిక ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బందికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

మెదక్‌ లోకసభ ఉపఎన్నిక పోలింగ్‌ ముగియడంతో మూడు ప్రధానపార్టీల నాయకులు తమ అభ్యర్థి విజయం సాధిస్తాడనే విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉన్నందున పోటీలో ఉన్న మూడు ప్రధానపార్టీలు ఈ నియోజకవర్గంలో వారం రోజులపాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

అధికార తెరాస పార్టీలో పార్టీ అభ్యర్థి ఘనవిజయం ఖాయమని విశ్వాసం వ్యక్తమవుతున్నది. గత లోకసభ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌ సెగ్మెంట్‌లో సుమారు 50 వేల ఓట్ల ఆధిక్యత లభించగా ఈ ఎన్నికల్లో సుమారు లక్షఓట్ల ఆధిక్యత సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

గత సాధారణ ఎన్నికల అనంతరం గడిచిన 3నెలల కాలంలో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఊహించని రీతిలో పుంజుకున్నందున గత లోకసభ ఎన్నికల మెజార్టీతో పోలిస్తే రెట్టింపు మెజార్టీ ఖాయమంటున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

కాగా కాంగ్రెస్ పార్టీలో సైతం ఆ పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని భావిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో చాలామంది పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ గ్రామస్థాయి క్యాడర్‌ మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఉత్సాహంగా పని చేసినందున సంప్రదాయ ఓటుబ్యాంకును సొమ్ము చేసుకోగలిగామని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

మూడు నెలల కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తమకు కొంతవరకు లాభించిందంటున్నారు. అనివార్య కారణాలవల్ల గత సాదారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేసిన తమపార్టీ కార్యకర్తలు పలువురు మళ్లీ అలాంటి తప్పు చేయబోమంటూ కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా కష్టపడి పని చేశారంటున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

మరోవైపు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపు ఖాయమని రెండుపార్టీల నాయకులు ధీమావ్యక్తం చేస్తున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

గజ్వేల్‌ నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీలో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీకి దూరమైనప్పటికీ గ్రామస్థాయిలో పార్టీ చెక్కుచెదరకపోగా మిగిలిన కార్య కర్తల్లో ఉత్సాహం పెరిగిందంటున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన సభకు హాజరైన జనమే తమ పార్టీ అభ్యర్థి విజయాన్ని సూచిస్తున్నదంటున్నారు. ఇలా మూడు పార్టీల నాయకుల్లో ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

తెలంగాణలోని మెదక్ లోకసభ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ శాసనసభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

మొత్తంమీద నియోజకవర్గంలో 65.74శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలకంటే దాదాపు 12 శాతం పోలింగ్ ఈసారి తగ్గింది.

 ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

కాగా తమ గ్రామాల్లో సౌకర్యాలు లేవని, ఓటింగ్‌ను బహిష్కరిస్తామని పెద్దపూరం, కుంచారంతండా, మర్‌కుక్ గ్రామాల ప్రజలు భీష్మించగా అధికారులు నచ్చచెప్పడంతో మధ్యాహ్నం వారు ఓటింగ్‌కు హాజరయ్యారు.

ఓటేసిన కేసీఆర్, చూపించిన హరీష్ భార్య (పిక్చర్స్)

ఓటేసిన కేసీఆర్, చూపించిన హరీష్ భార్య (పిక్చర్స్)

కాగా తమ గ్రామాల్లో సౌకర్యాలు లేవని, ఓటింగ్‌ను బహిష్కరిస్తామని పెద్దపూరం, కుంచారంతండా, మర్‌కుక్ గ్రామాల ప్రజలు భీష్మించగా అధికారులు నచ్చచెప్పడంతో మధ్యాహ్నం వారు ఓటింగ్‌కు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+