బెదిరిస్తున్నారు, భయపడను: బైరెడ్డి కూతురు కంటతడి

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ ఎన్నికల పొత్తు అవాస్తవమన్నారు. రాయలసీమలో 33 అసెంబ్లీ స్థానాల్లో, రెండు లోకసభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. కొందరు నాయకులు తాము ప్రచారం చేసుకోకుండా బెదిరిస్తున్నారని, వాటికి బెదరమన్నారు.
తనకు రాజకీయ అనుభవం లేదని, పోటీ నుంచి తప్పుకోవాలంటూ మహిళలు అని కూడా చూడకుండా బెదిరిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, హక్కులు, సాగునీటి సౌకర్యాల గురించి అడిగిన తన తండ్రిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు.
తన తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే తనను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో న్యాయం కోసం పోరాడుతున్న రాయలసీమ పరిరక్షణ సమితిని ప్రజలు గెలిపిస్తారన్న విశ్వాసం శబరి ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications