నేటి నుంచి కొత్త రూల్స్.. అర్థరాత్రి నుంచే మారిన బ్యాంకింగ్,తత్కాల్ బుకింగ్స్‌

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. క్యాలెండర్ పేజీ మారడమే కాదు, మన రోజువారీ బడ్జెట్‌పై ప్రభావం చూపే కీలక ఆర్థిక మార్పులు కూడా అమల్లోకి వస్తాయి. బ్యాంకు సేవలు, పన్ను నిబంధనలు, చివరికి రైల్వే టిక్కెట్ల బుకింగ్ వరకు ఎన్నో కొత్త రూల్స్ అర్థరాత్రి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఏయే మార్పులు రాబోతున్నాయి? మన జేబుకు ఎలా చిల్లు పడకుండా చూసుకోవాలి? అనే వివరాలు ప్రత్యేకంగా మీ కోసం..

ఐటీఆర్ దాఖలుకు ఈ నెలే లాస్ట్ డేట్

వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) సమర్పించడానికి ఈ నెల చివరి తేదీని గుర్తుంచుకోవాలి. పన్ను ఆడిట్ అవసరం లేని వారు తమ ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 ను ఆగస్టు 31 లోపు కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డెడ్ లైన్ దాటితే ఏకంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుముతో పాటు అదనపు వడ్డీ భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందే ప్రక్రియ పూర్తి చేయడం ఉత్తమం.

Key Financial Changes Effective August 1 ITR Deadline RBI MPC Meeting Tatkal Booking and Banking Rules

తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌లో కొత్త మార్పు

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఉండే భారీ తోపులాటలు, గందరగోళానికి చెక్ పెడుతూ 'టోకెన్ విధానాన్ని' అమల్లోకి తెచ్చింది. ఆగస్టు 1 నుంచి కౌంటర్ల వద్ద ఈ కొత్త పద్ధతిలోనే తత్కాల్ టిక్కెట్లను కేటాయిస్తారు. దీనివల్ల క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే తిప్పలు తగ్గి, ప్రయాణికులకు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

ITR ఫైలింగ్: పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే..
ITR ఫైలింగ్: పన్ను కట్టక్కర్లేని 10 ఆదాయాలు ఇవే..

లోన్ ఈఎంఐలపై పెరగనున్న ఉత్కంఠ

మన హోమ్ లోన్ ఈఎంఐలు, డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే ఆర్‌బీఐ ఎంపీసీ (Monetary Policy Committee) సమావేశం ఈ నెలోనే జరగనుంది. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ కీలక భేటీ నిర్ణయాలను ఆగస్టు 5న వెల్లడిస్తారు. ఆర్‌బీఐ తీసుకునే ఈ విధానపరమైన నిర్ణయాలే రాబోయే రోజుల్లో బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు, డిపాజిట్లపై రాబడులను శాసిస్తాయి.

క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్‌కు కోత

యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ వాడేవారికి చేదు వార్త. 'మాగ్నస్ ఫర్ బర్గుండి' కార్డ్‌పై ఇస్తున్న కొన్ని రాయితీలను ఆగస్టు 28 నుంచి తగ్గించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. కరెన్సీ మార్పిడి రుసుములు పెరగడంతో పాటు గిఫ్ట్ కార్డ్‌లు, టోల్ ఛార్జీల చెల్లింపులపై రివార్డు పాయింట్లను నిలిపివేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనల్లోనూ మార్పులు తెచ్చారు.

Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!
Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!

బ్యాంకింగ్ సర్వీస్ ఛార్జీలు ఇవే!

వివిధ బ్యాంకులు తమ సేవలకు సంబంధించిన ఛార్జీలను సవరించాయి. ఉదాహరణకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మెసేజ్ హెచ్చరికల (SMS alerts) కోసం మెసేజ్‌కు 30 పైసల చొప్పున ఛార్జ్ చేయనుంది. మిగతా బ్యాంకులు కూడా డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుములు, ట్రాన్సాక్షన్ ఛార్జీలను అప్‌డేట్ చేస్తుంటాయి. కాబట్టి మీ బ్యాంక్ ఇచ్చే నోటిఫికేషన్లను ఒకసారి చెక్ చేసుకోవడం ద్వారా అనవసరపు సర్వీస్ ఛార్జీల బాదుడు నుంచి తప్పించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+