అమరావతిలో మెడికల్ కాలేజ్, స్టార్ హోటల్ : కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

Subscribe to Oneindia Telugu

అమరావతి: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తీర్చిదిద్దే పనిలో పడింది ఏపీ సర్కార్. ఈ మేరకు అభివృద్ది ప్రణాళికలు రచిస్తున్న సర్కార్..తాజాగా మెడికల్ కాలేజీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది.

Cabinet sub committee decision on Medical college in Amaravati!

గురువారం ఉదయం సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ దీనిపై చర్చించి.. రూ. 4వేల కోట్లతో మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి, స్టార్‌హోటల్‌ నిర్మాణం జరిపించాలని నిర్ణయించింది. వీటితో పాటు బీఆర్‌శెట్టి మెడికల్‌ వర్సిటీకి 100 ఎకరాలు,అమరావతి సబ్‌డివిజన్‌ పీఎస్‌కు 1.5 ఎకరాలు కేటాయించే విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక రాజధాని భవనాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్లపై రెండు రోజుల్లోగా బిడ్‌ల పరిశీలన చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. నారాయణ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Cabinet sub committee was taken a crucial decision of building a medical college in Amaravati. Adding to that 100acres for BR shetty medical versity and 1.5acres for amaravati subdivision, cabinet was taken decisions to further move
Please Wait while comments are loading...