ఎపిఎన్జీవోలతో చర్చలు విఫలం: తేల్చిచెప్పిన అశోక్‌బాబు
హైదరాబాద్: మంత్రివర్గ ఉపసంఘంతో ఎపిఎన్జీవోల చర్చలు ఆదివారం విఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించే ప్రస్తక్తి లేదని స్పష్టంగా చెప్పారు. చర్చల అనంతరం ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. తాము సమ్మెను విరమించే ప్రసక్తి లేదని స్ఫష్టంగా చెప్పామని, విభజన వల్ల అన్ని వర్గాల ఉద్యోగులు ఎలా నష్టపోతున్నారో చెప్పామని, సమ్మె చేస్తున్న సంఘాలు వారి సమస్యలను మంత్రివర్గ ఉపసంఘంతో చెప్పారని తెలిపారు.
తమ సమస్యలపై చర్చించి మళ్లీ పిలుస్తామని ఉపసంఘం చెప్పిందన్నారు. సమ్మె చాలా శాంతియుతంగా జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘంతో చెప్పామన్నారు. ఎస్మా పెడతామని చెప్పడం ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగమే అన్నారు.

ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను ముఖ్యమంత్రితో చర్చించి చెబుతామన్నారని తెలిపారు. తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. విభజనతో ఉద్యోగులే తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వాల నుండి సమైక్య ప్రకటన వచ్చే వరకు సమ్మె ఆపేది లేదన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను రాజకీయ పార్టీలు, కేంద్రం అర్థం చేసుకున్నాయని, సీమాంధ్ర ఉద్యమాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఎస్మా ప్రయోగం ప్రభుత్వంలో ఓ భాగమన్నారు. ఉద్యోగులపై తమకు కక్ష సాధింపు లేదన్నారు.












Click it and Unblock the Notifications