కాల్ మనీ షాక్: రూ.30వేల అప్పు రెండేళ్లలో రూ.80 లక్షలు అయింది

విజయవాడ: కాల్ మనీ నిర్వాహకుల దురాఘతాలపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అనపర్తికి చెందిన ఓ వ్యాపారి నుంచి కాకినాడకు చెందిన ఓ బాధితుడు ఐదేళ్ల క్రితం రూ.30 వేలు తీసున్నారు. అది రెండేళ్ల తర్వాత రూ.80 లక్షలు అయిందని లెక్క చూపించడం గమనార్హం.

దీంతో, అప్పు ఇచ్చిన వ్యాపారి రూ.కోటి విలువైన ఆస్తిని తన పేరున బదలాయించుకున్నాడు. తమను వేధిస్తున్న కాల్ మనీ నిర్వాహకుల పైన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వరుస కడుతున్నారు. బుధవారం సోదాలు చేసిన పోలీసులు వ్యాపారుల ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో భారీ ఎత్తున ప్రామిసరీనోట్లు, బ్లాంక్ చెక్కులు, భూమి రిజిస్ట్రేషన్‌ పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో కాల్ మనీ నిర్వాహకులకు చెందిన బౌన్సర్లు ఓ వృద్ధుడి పైన దాడి చేశారు. కాకులపాడుకు చెందిన వెంకటేశ్వర రావుపై బౌన్సర్లు దాడి చేశారు. అతను సిపిని కలిసి తన గోడు వినిపించుకున్నారు.

Call Money: AP orders judicial probe

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కొవూరులో కాల్ మనీ వ్యాపారులు రాజగోపాల్, శ్రీకర్ ఇళ్లలో గురువారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వారి నుంచి ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు.. గ్యాస్ సిలిండర్లు తదితరాలను కూడా తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారని తేలింది.

చిత్తూరులోని ప్రశాంత్ నగర్‌లో రెండు కుటుంబాలను కాల్ మనీ నిర్వాహకులు కొద్ది రోజులుగా నిర్బంధించారు. వారు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను డబ్బులు చెల్లించాలని నిర్బంధించారని చెప్పారు. కాగా, కాల్ మనీ పైన న్యాయవిచారణకు ప్రభుత్వం మొగ్గు చూపిన విషయం తెలిసిందే. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి బాధ్తయలు అప్పగించనున్నారు.

వడ్డీవ్యాపారుల వేధింపులకు మహిళ మృతి

కడపలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ మహిళ బలైంది. అవసరం నిమిత్తం ఆ మహిళ రూ.1.5 లక్షలు అప్పు చేసింది. ఆమె క్రమం తప్పకుండా వడ్డీ చెల్సిస్తున్నప్పటికీ.. బెదిరించి ఆమె పేరుతో ఉన్న అయిదు సెంట్ల స్థలాన్ని తమ పేరిట రాయించుకున్నారు. బుధవారం రాత్రి మరోసారి బెదిరించడంతో మనస్థాపానికి గురై మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+