ఔటర్లో డివైడర్‌ను ఢీకొన్న ఇన్నోవా, మృతి: విద్యార్థినికి హాస్టల్లో వేధింపు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మేడ్చల్ ఔటర్ రింగు రోడ్డు వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు రావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారు మృతుడి భార్య, పిల్లలేనని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగం కారణమని తెలుస్తోంది.

గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఈ ప్రమాదంలో ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లయింది.

Car catches fire at Medchal ORR

సస్పెండైన ఎస్సై ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నంలో సస్పెండ్‌ అయిన ఎస్సై వీరాంజనేయులు ఆత్మహత్య కలకలం రేపుతోంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వీరాంజనేయులు సూసైడ్‌ నోట్‌ రాశాడు. 2013 బ్యాచ్‌కు చెందిన వీరాంజనేయులు 2014లో శ్రీకాకుళం జిల్లా వంగరలో ఎస్సైగా విధులు నిర్వహించాడు.

9వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

విజయవాడ జిల్లాలోని మచిలీపట్నంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై హాస్టల్‌ యాజమాని లైంగిక వేధింపలకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నం వడ్డించేందుకు గదిలోకి వెళ్లిన విద్యార్థినిపై హాస్టల్‌ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి తల్లికి విషయం చెప్పింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+