మహిళపై దౌర్జన్యం: కిల్లి కృపారాణి భర్తపై కేసు, అరెస్ట్!
విశాఖపట్నం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్ రావు పైన భీమిలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. తన పైన రామ్మోహన్ రావు దౌర్జన్యం చేశారని సుగుణ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రామ్మోహన్ రావు, అతని డ్రైవర్ పైన కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, తన భర్త పైన కేసు నమోదు చేయవద్దని కిల్లి కృపారాణి పోలీసులను అడిగినట్లుగా తెలుస్తోంది.

రామయ్యపై కేసు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామయ్య పైన భూఆక్రమణ ఆరోపణలు వస్తున్నాయి. దళిత సంఘాలు పోలీసులను ఆశ్రయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. విజయవాడ భవానీపురంలో పోలీసు స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications