సిఇవోపై అనుచిత వ్యాఖ్యలు: గిరీష్ సంఘీపై కేసు
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఇవో సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాజీ పార్లమెంటు సభ్యుడు గిరీష్ సంఘీపై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో గిరీష్ సంఘీ, మాజీ శాసనసభ్యుడు ప్రేమ్ సింగ్ రాథోడ్‌తోపాటు మరో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు బేగంపేట ఎసిపి మనోహర్ మంగళవారం చెప్పారు.
కంటోనె్మంట్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా ఆర్య వైశ్యులకు చెందిన అగ్రసేన్ భవన్‌ను కూల్చే యత్నాన్ని నిరసిస్తూ సంఘీ నేతృత్వంలో పోలీసుల అనుమతి కూడా లేకుండా గత నెల 21న తేదీన సభ నిర్వహించారు. ఈ సభలో కంటోనె్మంట్ సిఇవో సుజాతపై సంఘీ, ప్రేమ్‌సింగ్ రాథోడ్‌లు ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సిఇవో సుజాత గత నెల 23 బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణకు తీసుకున్న బేగంపేట ఎసిపి మనోహర్, సిఐ శ్రీహరి ఆధ్వర్యంలో అదే రోజు సుజాత వాంగ్మూలాన్ని తీసుకున్నారు. కంటోనె్మంట్ సిఇవో సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గిరీష్ సంఘీ, ప్రేమ్ సింగ్ రాథోడ్‌తోపాటు మరో 20 మందిపై 188, 283, 504, 505, 506, 354ఎ ని, 509 తదితర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని ఎసిపి మనోహర్ చెప్పారు.
ఈ కేసులో బెయిల్ కోసం సోమవారం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. దీంతో తిరిగి మంగళవారం మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కుమారుడి పెళ్లి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications