మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు .. దళితులను అవమానించారంటూ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే చంద్రబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళితులను చంద్రబాబు అవమానించారంటూ ఆయనపై నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా చంద్రబాబుపై కేసు నమోదైంది.

చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు ..కేసు నమోదు
పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు చంద్రబాబు బోస్టన్ కమిటీ నివేదిక విషయంలో విజయ్ కుమార్ పై మాజీ సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, దళితుడు కాబట్టే అవమానించారని నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఓ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతామని చెప్పారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు తాజాగా బోస్టన్ కమిటీ నివేదిక విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చిన విజయ్ కుమార్ పై చంద్రబాబు వ్యాఖ్యలు
ఆ సమయంలో ఆయన కమిటీ కి ఉన్న విశ్వసనీయత ఏంటి అన్న అంశాన్ని సవాలు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కనీసం రిపోర్టులో ఏముందో చదవకుండానే వివరాల్ని బయటపెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘రిపోర్టు సారాంశాన్ని అరగంటలోనే అర్థం చేసుకునేంత ట్యాలెంట్ మీకుందా? ఓ ప్రైవేటు కంపెనీ తయారుచేసిన రిపోర్టును చదవడానికి విజయ్ కుమార్ ఎవడు? వాడెవడో రిపోర్టిస్తాడట.. వీడెవడో చదువుతాడట''అంటూ చంద్రబాబు ఫైరయ్యారు.

విజయ్ కుమార్ ఎస్సీ కాబట్టే చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వైసీపీ మంత్రులు
విజయ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం చేశారని వైసీపీ మంత్రులు మండిపడ్డారు. కుల వివక్ష కారణంగానే ఆయనను అవమానించారని ఆరోపించారు. చంద్రబాబు ఓ కుల దురహంకారి అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు . ఐఏఎస్ అధికారికి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మంత్రులు ఆదివారం ఉమ్మడిగా ఒక లేఖను కూడా రాశాను.

దళితులను అవమానించారని నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు
ఇక ఈ నేపధ్యంలోనే ఒక ఐఏఎస్ అధికారిని అవమానించారని, ఆయన ఎస్సీ కావటంతోనే అవమానించారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు చంద్రబాబుపై ఫిర్యాదు చెయ్యగా నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా వైసీపీ నేతలు కావాలని చేస్తున్న కుట్ర అని, ఏ కులాన్ని అవమానించేలా చంద్రబాబు వ్యాఖ్యలు చెయ్యలేదని టీడీపీ నేతలు చెప్తున్నారు. అసలు విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications