లేపాక్షి నాలెడ్జి: జగన్, గీతారెడ్డిలకు కోర్టు సమన్లు

జగన్ ఆస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంపై సిబిఐ సమర్పించిన చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు నిందితులకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. లేపాక్షి వ్యవహారంలో విజయసాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీ, శామ్యూల్, మురళీధర్ రెడ్డి తదితరులకు కోర్టు సమన్లు జారీ చేసింది.
అనంతపురం జిల్లాలోని రెండు మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్ఱభుత్వం 8,842 ఎకరాల భూములను కేటాయించింది. ఈ కేటాయింపుల సందర్భంగా చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలను కాలారాశారనే ఆరోపణలున్నాయి. దాంతో వైయస్ జగన్‌కు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహారం నడిచిందని ఆరోపిస్తున్నారు. దాదాపు యాభై శాతం భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి అప్పులు తీసుకున్నట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినట్లు సిబిఐ ఆపోపిస్తోంది.
కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ భూముల కేటాయింపు జరిపినప్పుడు జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల మంత్రిగా, ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితులు జగన్ సహా బెయిల్‌పై విడుదలై బయట ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications