తిరుపతిలో అటువైపు వెళితే మీకు మూడినట్లే, సీసీటీవీ కెమెరాలు, మెయిన్ గేట్ల దగ్గరే !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తరువాత పలు ప్రాంతాల్లో గొడవలు జరగడంతో ఉద్రక్తి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాలోని స్ట్రాంగ్ రూంల్లో ఈవీఎంలు భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలు పరిశీలించడానికి వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై దాడులు జరగడంతో ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. మహిళా యూనివర్శిటీ ప్రాంగణంలో దాడులు జరడంతో ఈసీ సీరియస్ అయ్యింది.
తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్శిటీలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూంలతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి నగరపాలక కమీషనర్ అదితిసింగ్ తో కలిసి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శ్రీపద్మావతి యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూంలు పరిశీలించారు.

స్ట్రాంగ్ రూంల దగ్గర భద్రతను పరిశీలించి పోలీసు అధికారులతో చర్చించారు. శ్రీ పద్మావతి యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూంలు ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ పరిసర ప్రాంతాల్లో నియమాలు ఉల్లంఘించి ఎవరైనా సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. స్ట్రాంగ్ రూంల పరిసర ప్రాంతాల్లోకి ఇతరులుల ఎవ్వరూ రాకూడదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని పార్టీల కార్యకర్తలకు సూచించారు.
మరోసారి హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడటానికి భద్రత విషయంపై అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చర్చించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటిటగ్ జరుగుతుండటంతో ఆ రోజు నుంచి రెండు వారాల పాటు తిరుపతి జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు సూచించారు. పద్మావతి యూనివర్శిటిలోకి ఇతరులు ఎవ్వరూ ప్రవేశించకుండా ప్రధాన గేట్ ల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications