ఆ జీవోలు ఎందుకు ఇచ్చారు : వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే : సీయ‌స్ ను వివ‌ర‌ణ కోరిన ఎన్నిక‌ల సంఘం..!

ఏపి పై ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక దృష్టి సారించింది. గ‌త వారం ఏపి ఇంట‌లిజెన్స్ చీఫ్ తో పాటుగా రెండు జిల్లాల ఎ స్పీ ల‌ను బ‌దిలీ చేసింది. అయితే, ఇంట‌లిజెన్స్ చీఫ్ ను త‌ప్పించాల‌నే ఆదేశాల పై ఏపి ప్ర‌భుత్వం న్యాయ పోరాటం చేసింది. ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాల‌కు భిన్నంగా జీవోలు ఇచ్చింది. దీని పై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని వివ‌రణ కోరింది. ఆ జీవోలు ఎందుకు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు..

సీయ‌స్ ను వివ‌ర‌ణ కోరిన ఈసీ

సీయ‌స్ ను వివ‌ర‌ణ కోరిన ఈసీ

కేం‍ద్ర ఎన్నికల సంఘంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ పునేథ సోమవారం సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ జీవో వ్యవహారంపై సీఈసీ వివరణ కోరింది. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘం అధికారు లతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇంటలెజిన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ 716 జీవో జారీ చేసిన తర్వాత, ఆ జీవోను రద్దు చేసి 720, 721 జీవోలను ఎందుకు జారీ చేశారంటూ సీఈసీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసిన తర్వాత అనిల్‌ పునేథ ముభావంగా వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి మూలం గా నే సీఈసీ ఆదేశాలకు విరుద్ధంగా జీవో జారీ చేయాల్సి వచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమా చారం. ఈ మొత్తం వ్య‌వ‌హారం పై సీయ‌స్ మ‌న‌స్థాపానికి గురైనట్లు చెబుతున్నారు.

ఏపి పై ఈసి ప్ర‌త్యేక దృష్టి..

ఏపి పై ఈసి ప్ర‌త్యేక దృష్టి..

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ లో భాగంగా ఏపి పై ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయి. వైసిపి ఏపిలోని పోలీసు అధికారుల పై ఫిర్యాదులు చేసింది. నేరుగా డిజిపి మొద‌లు జిల్లాల ఎస్పీల వ‌ర‌కు ఈ ఫిర్యాదుల్లో ఉన్నారు. దీని పై ప్రాధ‌మికంగా విచార‌ణ చేసి చ‌ర్య‌లు ప్రారంభించిం ది. ఏకంగా ఏపిలోని పోలీసు శాఖ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌త్యేక అధికారి శ‌ర్మ‌ను నియ‌మించింది. ఏపి లోని అధికారిక నిర్ణ‌యాలు..పోలీసుల పాత్ర‌ను ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక‌, ఇంట‌లిజెన్స్ డిజి ని కోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. పోలీసు ముఖ్య కార్యాల‌యానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఎ న్నిక‌ల విధుల‌కు దూరంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, ఇప్ప‌టికీ ఇంట‌లిజెన్స్ డిజి గా ప‌ని చేసిన వేంక‌టే శ్వ‌ర రావు పై వైసిపి ఇంకా ఫిర్యాదులు కొన‌సాగిస్తోంది.

సున్నితంగా మారుతున్న నిర్వ‌హ‌ణ‌..

సున్నితంగా మారుతున్న నిర్వ‌హ‌ణ‌..

ఏపిలో ఎన్నిక‌ల వ్య‌వ‌హారం సున్నితంగా మారుతోంది. వైసిపికి అనుకూలంగా కేంద్ర ఒత్తిడితో ఏపి లో ఎన్నిక‌ల సం ఘం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని టిడిపి ఆరోపిస్తోంది. ఇదే స‌మ‌యంలో త‌మ ఫిర్యాదుల పై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ గా నిర్ణ‌యాలు తీసుకోవ‌టం లేద‌న్న‌ది వైసిపి వాద‌న‌. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏపి నుండి వ‌స్తున్న ప్ర‌తీ ఫిర్యాదు పైనా ఎన్నిక‌ల సంఘం లోతుగా అధ్య‌య‌నం చేస్తోంది. ఏపికి ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో పాటుగా పెద్ద సంఖ్య లో ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌ను నియ‌మించారు. వారు ఇప్ప‌టికే బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+