వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం నోటీసులు: చ‌ంద్ర‌బాబుపై బీజేపీ యూ ట‌ర్న్‌: మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా క‌న‌పించిన కేంద్ర ప్ర‌భుత్వ పెద్దల తీరులో తేడా వ‌చ్చింది. పీపీఏల విష‌యంలో జ‌గ‌న్ ప‌ట్టు వీడ‌క‌పోవ‌టం...దీనికి కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంటున్న వేళ .. చంద్ర‌బాబు ఇదే స‌రైన స‌మయంగా భావిస్తున్నారు. ఇక‌, కేంద్ర ప‌రిధిలో ఉండే విద్యుత్ సంస్థ‌లు త‌మ‌కు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర డిస్కంల‌కు నోటీసులు ఇచ్చాయి. రాజ‌ధాని అమ‌రావ‌తికి రుణం అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం తుది నిర్ణ‌యాన్ని శాస‌న‌స‌భ‌లో చంద్ర‌బాబు ప‌ల్లెత్తు మాట అన‌లేదు. కేంద్రం ఆ నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి మీరే క‌ల్పిం చారంటూ వైసీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. మొత్తంగా..రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మార్పు క‌నిపిస్తోంది.

Recommended Video

రైతుల పై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్
ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు..

ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పీపీఏల విష‌యంలో వెనక్కు త‌గ్గ‌టం లేదు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తాము నిర్వ హిస్తున్న పీపీఏల స‌మీక్ష‌కు రావాలంటూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న విద్యుత్ సంస్థ‌ల‌కు లేఖ రాసారు. అయినా
ఆ సంస్థ‌ల ప్ర‌తినిధులు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మీక్ష‌కు హాజ‌రు కాలేదు. ఇదే స‌మ‌యంలో ఎన్టీపీసీ..సోలార్ ఎనర్జీ కార్పోరే ష‌న్ ఆఫ్ ఇండియా ఏపీకీ నోటీసులు పంపింది. త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ చేసా యి. లేకుంటే లీగ‌ల్‌గా ముందుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం పీపీఏల స‌మీక్ష కోసం వేగంగా అడుగులు వేయ‌టం..శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించ‌టం.. స‌మీక్ష కోసం సంస్థ‌ల‌ను ఆహ్వానించ‌టంతో..అప్ప‌టికే లేఖ‌ల ద్వారా సమీక్ష‌లు వ‌ద్ద‌ని చెప్పిన కేంద్రం ఇక ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగింది. అందులో భాగంగానే.. చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకొనే అవ‌కాశం ఉన్నా..నోటీసుల వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది.

కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌ని చంద్రబాబు..

కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌ని చంద్రబాబు..

పీపీఏల విష‌యంలో తొలి నుండి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చంద్ర‌బాబు హాయంలో అవినీతి జ‌రిగింద‌నే ఉద్దేశంతో స‌మీక్ష‌లకు దిగింది. దీనిని స‌హ‌జంగానే చంద్ర‌బాబు వ్య‌తిరేకిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అసెంబ్లీలో రాజ‌ధానికి ప్ర‌పంచ బ్యాంక్ రుణం నిలుపుద‌ల పైన ప్ర‌భుత్వం స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందులో రాజ‌ధాని పైన త‌మకు వ‌చ్చిన ఫిర్యాదుల పైన క్షేత్ర స్థాయి స‌మీక్ష‌ల కోసం వ‌స్తామ‌ని కేంద్రాన్ని ప్ర‌పంచ బ్యాంక్ కోర‌గా..అందుకు కేంద్రం నో చెప్పింది. దీని పైన ఏపీ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించగా..ఏపీ ప్ర‌భుత్వం నెల రోజులు స‌మ‌యం కోరారు. ఈ లోగానే కేంద్రం అనుమ‌తి నిరాక‌రించ టంతో రుణం ర‌ద్దు చేసారు. స‌భ‌లో దీని పైన మాట్లాడిన చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త కార‌ణంగానే కేంద్రాని కి ఆ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిందంటూ వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ నేత‌లు వ‌రుస‌గా బీజేపీలోకి వెళ్తున్నా.. పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఏకంగా పార్ల‌మెంట‌రీ పార్టీని బీజేపీలో విలీనం చేసినా చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకోవ‌టం లేదు. ప‌రోక్షంగా కేంద్రం పైన సానుకూల వైఖ‌రితో ఉన్నారు.

మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

ఇదే స‌మయంలో రాజ‌కీయంగానూ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా బీజేపీ నేత‌లు ఆప రేష‌న్ ఆక‌ర్ష్ కొన‌సాగిస్తున్నా చంద్ర‌బాబు స్పందించ‌టం లేదు. అదే విధంగా త‌న పార్టీ నుండి బీజేపీలోకి వెళ్లి గ‌తంలో చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌ల‌ని విమ‌ర్శించినా..ఒక్క నేత సైతం తిప్పి కొట్ట‌లేదు. ఎన్డీఏలోకి టిడిపికి ఛాన్స్ లేదంటూ బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్నా ఎవ‌రూ స్పందించ‌టం లేదు. ఇక‌...బీజేపీ నేత‌లు సైతం కొద్ది రోజులుగా వైసీపీని ల‌క్ష్యంగా చేసుకొని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కులం..మ‌తం..దౌర్జ‌న్యాల పేరుతో తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టీడీపీ హ‌యాం కంటే ప‌రిస్థితి దిగ‌జారింద‌ని ఆరోపిస్తున్నారు. కానీ, ఎక్క‌డా వైసీపీ నేత‌లు మాత్రం బీజేపీ నేత‌ల విమర్శ‌ల‌కు అదే స్థాయిలో స‌మాధానం చెప్ప‌టం లేదు.

English summary
Central Govt serious on Ap Govt in PPA's Review issue. Central power projects letter to AP Govt for clear pending bills. At the same time BJP leaders target YCP Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X