అమరావతి లో కీలక నిర్మాణానికి కేంద్రం బ్రేక్..!!

అమరావతి కేంద్రంగా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. త్వరలో పనులు మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్దం చేస్తు న్నారు. ఇదే సమయంలో అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక నిర్ణయం జరిగింది. ఏపీ ప్రభు త్వం ప్రతిపాదించిన 189.4 కిమీ ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ కు కేంద్ర రవాణా శాఖ ఎలైన్ మెంట్ కమిటీ ప్రాధమికంగా ఆమోద ముద్ర వేసింది. కాగా, ఓఆర్ఆర్ కు దగ్గరగా ప్రతిపాదించిన తూర్పు బైపాస్ అవసరం లేదని పేర్కొంది.

కేంద్ర కమిటీ ఆమోదం
అమరావతిలో కీలక అడుగులు పడుతున్నాయి. అమరావతిలో ఏపీ ప్రభుత్వం 189.4 కిలోమీటర్ల తో ఒకే ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించింది. ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టు పైన జాతీయ రహదారులు - రవాణా శాఖ ఎలైన్ మెంట్ కమిటీలు పరిశీలన చేసారు. కొన్ని స్వల్ప మార్పులు సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్‌వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16 వేల 310 కోట్ల వ్యయమవుతుందని అంచనా. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, బిటుమిన్‌ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు ఇవ్వటంతో పాటుగా.. కంకర, గ్రావెల్‌ తదితరాలకు సీనరేజ్‌ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Central High ways alignment committee Gives preliminary approval for Amaravati ORR

చంద్రబాబు హామీతో
దీంతో, ఈ మేర వ్యయం 11 వందల 56 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15 వేల 154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ వెంబడి రైల్వేలైన్‌ నిర్మాణం, ఇతరత్రా వాటికి భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రోడ్డుకి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకూ వీలుంటుందని కమిటీ తెలిపింది. ఇదే సమయంలో ఈ కమిటీ మరో కీలక సూచన చేసింది. నాలుగు వరుసల బైపాస్ అవసరం లేదని స్పష్టం చేసింది.

బైపాస్ అవసరం లేదు
ఏపీ ప్రభుత్వంవిజయవాడకు తూర్పువైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్‌ అక్కర్లేదని కమిటీ తేల్చింది. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో, దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్‌ నిర్మించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రెండింటికీ మధ్య ఎక్కువ దూరం లేని విషయాన్ని ప్రస్తావించింది. అయితే చెన్నై-కోల్‌కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్‌ను ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేయాలని సూచన చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో భూముల క్రయవిక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+