జగన్ భద్రతపై కేంద్ర ఇంటలిజెన్స్ కీలక నివేదిక..!!
ఏపీ మాజీ సీఎం జగన్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పైన మరో కేసు నమోదైంది. సింగయ్య ప్రమాదానికి కారణమయ్యారంటూ జగన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇదే సమయంలో జగన్ భద్రత పైన వైసీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో జగన్ తన భద్రత పైన పిటీషన్ దాఖలు చేసారు. కాగా, జగన్ భద్రతకు సంబంధించి కోర్టులో కేంద్రం ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది. కీలక అంశాలను వెల్లడించింది.
కోర్టులో నివేదిక
మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత కు ఎలాంటి ముప్పు లేదని కేంద్రం ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నివేదించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సెక్యురిటీ కల్పించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. కాగా, ఈ పిటీషన్ పైన విచారణ జరిగింది . కాగా, ఇప్పటికే 58 మందితో జగన్‌కి జడ్‌ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు.

భద్రత కల్పిస్తున్నాం
ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశిం చింది. కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం జగన్ పర్యటనల్లో కల్పిస్తున్న భద్రత పైన స్పష్టత ఇచ్చింది. రాప్తాడు నియోజక వర్గంలో జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో 506 మందితో భద్రత కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. సత్తెనపల్లి, మిర్చియార్డు పర్యటన సమయంలోనూ అవసరమైన మేర భద్రత కల్పించినట్లు స్పష్టం చేస్తున్నారు. పులివెందులలో జగన్ ఇంటి వద్ద 71 మందితో భద్రత కల్పించినట్లు అధికారిక వర్గాల సమాచారం.
నేడు కీలక భేటీ
ఇక, తాజాగా జగన్ పైన మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు గుంటూరు మిర్చి యార్డులోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పాల్గొన్న పార్టీ నేతలకు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై అదే రోజు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 206/2025తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జగన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. జగన్ మినహా మిగిలిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. ఇక, ఈ కేసులు.. రాజకీయంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
-
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..!










Click it and Unblock the Notifications