ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్: రూ.25,000 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్టుకు అనుమతులను మంజూరు చేసింది.
ఆ ప్రాజెక్టే- అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ వే. దీని మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. విజయవాడ-మంగళగిరి- గుంటూరు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. నందిగామ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లిని కనెక్ట్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మితమౌతుంది.

దీని నిర్మాణ అంచనా వ్యయం ఏకంగా 25,000 కోట్ల రూపాయలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత ఇంత పెద్ద మొత్తంలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి కూడా కావడం చర్చనీయాంశమైంది.
ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. భూసేకరణతో సహా అన్ని రకాల ఖర్చులను కేంద్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
Significant infrastructure development is set to transform Amaravati with the approval of a new 189 km outer ring road expressway by the Indian government under the leadership of Prime Minister Shri Narendra Modi.
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) July 9, 2024
Here are the key details:
- The estimated cost of the project is… pic.twitter.com/Af8IVivHTV
రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పురంధేశ్వరి అన్నారు. ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని చెప్పారు.
రహదారుల వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోందని, అందుకే తమ 10 సంవత్సరాల హయాంలో ఏపీలో లాజిస్టిక్ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. రెండు చోట్లా అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తూ అమరావతి, రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications