హైదరాబాద్‌పై 3 ఆప్షన్స్: కేబినెట్ ముందుకు సస్పెన్స్

కేంద్ర హోంశాఖ అధికారులు చేస్తున్న ప్రాథమిక కసరత్తుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. విభజన విషయంలో హైదరాబాద్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. తెలంగాణ నోట్ సిద్ధమైందని అయితే హైదరాబాద్ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
కేంద్ర హోంశాఖ హైదరాబాదు పైన ప్రాథమికంగా మూడు ప్రతిపాదనలను రూపొందించింది. మూడింటిలోను హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సూచించారు. ఏ ప్రతిపాదనతో ఎటువంటి రాజకీయ ప్రభావం ఉంటుందన్న అంశాన్ని పరిశీలించారట. ఈ మూడు ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకు వెళ్తారా లేక మార్పులు చేర్పులు ఉంటాయా అన్న దాని పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
కాగా, జిహెచ్ఎంసి సరిహద్దులతో కలిపి హైదరాబాదుకు కేంద్రపాలిత ప్రాంత హోదాను కల్పించి, సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు రాజధానులను చండీగఢ్ తరహాలో శాశ్వతంగా హైదరాబాదులోనే ఏర్పాటు చేయడం మొదటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో సీమాంధ్ర ప్రాంతాన్ని హైదరాబాదుకు కలిపే అన్ని రహదారులను కేంద్రపాలిత ప్రాంత పాలనలోకి తీసుకు రావాలి, సీమాంధ్రతో హైదరాబాదును అనుసంధానించే అన్ని రహదారులకు సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించాలి.
జిహెచ్ఎంసి సరిహద్దుల వరకు హైదరాబాదును పదేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచి, తెలంగాణకు హైదరాబాదును శాశ్వత రాజధానిగా, సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్లపాటు తాత్కాలిక రాజధానిగా చేయడం రెండో ప్రతిపాదన. జిహెచ్ఎంసి సరిహద్దుల వరకు హైదరాబాదుకు కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించి, తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేసుకోవాలనేది మూడో ప్రతిపాదన. హైదరాబాదును దేశ రెండో రాజధానిగా ప్రకటించడం. ఈ ముడు కాకుండా మరో ప్రత్యామ్నాయం పైన కూడా హోంశాఖ కసరత్తు చేస్తోందట.












Click it and Unblock the Notifications