వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం బిగ్ న్యూస్-అందులో విలీనం..?
నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్దమవుతోంది. ఓవైపు ముడిసరుకు కొరత, మరోవైపు శాశ్వత గనుల కేటాయింపు లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ కు నష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఊరట దక్కినట్లే భావిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్ ) లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం.. కార్మికుల ఆందోళనలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన సెయిల్ లో విలీనం చేస్తే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కు చెందిన భూముల్ని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ (ఎన్ఎండీసీ)కి విక్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే స్టేట్ బ్యాంక్ తో చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు ఫలిస్తే స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. దీంతో అతి త్వరలోనే సెయిల్ లో విలీనం కోసం పావులు కదపవచ్చని సమాచారం. దీంతో కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications