తప్పేలా లేదు, నేనే తెచ్చా: జెసి, సమైక్యమే కానీ: బొత్స
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకు వచ్చింది తానేనని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యంలా కనిపిస్తోందని ఆయన చెప్పారు. కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదన పైన ఆలోచిన చేస్తోందని తాను భావిస్తున్నానని అన్నారు. సీమలోని వాస్తవ పరిస్థితులను అన్ని పార్టీలు గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు.
సమైక్యమే కానీ: బొత్స
తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా హైదరాబాదులో చెప్పారు. అయితే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి తీర్మానాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు.

తనకు తెలిసినంత వరకు తెలంగాణ అంశంపై బిల్లు మాత్రమే అసెంబ్లీకి వస్తుందన్నారు. అయితే తీర్మానం కూడా కావాలని తాము అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
బస్సు ప్రమాదంపై...
మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద ఘటనలో యజమానులైన దివాకర్ రోడ్ లైన్స్ పైన కేసు నమోదు చేసినట్లు బొత్స తెలిపారు. ఇప్పటి వరకు 601 బస్సుల పైన కేసులు నమోదు చేశామని చెప్పారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఎక్స్‌గ్రేషియా పైన ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. వోల్వో బస్సు ప్రమాదంపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సు ధరల పెంపుపై మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచవలసి వచ్చిందన్నారు. దూర ప్రాంతాలకు కొత్త బస్సులను నడుపుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications