స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అనూహ్య నిర్ణయం, ఉపసంహరణ - నెక్స్ట్ ఇక...!!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొంత కాలంగా స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వరుస ప్రమాదాలు.. యాజమాన్య నిర్ణయాల పైన ఆగ్రహం తో ఉన్నాయి. కాగా.. తాజాగా స్టీల్ ప్లాంట్‌ నుంచి మిగిలిన సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేయటంతో కొత్త చర్చ మొదలైంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు భద్రతగా ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా ఉప సంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్రం 3 నెలల గడువు ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది కొనసాగుతున్నారు. కాగా, 2024 వరకు స్టీల్ ప్లాంటోలో సుమారు 1500 మంది సీఐఎస్ఎఫ్ బలగాలు ఉండగా, ఆ తర్వాత దశలవారీగా సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో ప్లాంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2026 నవంబరు 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్‌ వింగ్‌లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!
కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!
centre-orders-withdrawal-of-cisf-personnel-from-visakhapatnam-steel-plant-by-november-17-details-he

తాజా నిర్ణయం పై కార్మిక సంఘాల్లో చర్చ

ఈ సీఐఎస్‌ఎఫ్‌ బలగాల ఉపసంహరణను ఉక్కు పరిశ్రమ అధికారులు అధికారికంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. అయితే, గతంలో 400 మంది వరకు సీఐఎస్‌ఎఫ్, సెక్యూరిటీ, ఫైర్‌ విభాగం సిబ్బందిని తొలగించగా.. వారి స్థానంలో ఏపీ స్పెషల్‌ ఫోర్స్‌ బలగాలను నియమించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఉపసంహరించాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందనే సమాచారంతో కార్మిక సంఘాలు ఈ వ్యవహారం పైన ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లోని సీఎస్‌ఎఫ్ బలగాలకు సంబంధించి.. భద్రతా విభాగంలో 1,033మంది.. అగ్నిమాపక విభాగంలో 298మంది ఉన్నారు. అయితే, ఇప్పుడు పూర్తిగా వీరిని ఉప సంహరించిన తరువాత వీరి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలకు భద్రతా బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+