బతుకమ్మ వేడుకలు షెడ్యూల్ ఇదే.. అక్టోబర్ 10 నుంచి 18 వరకు..

తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ సంబరాలకు సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. అక్టోబర్‌ 18న తేదీన సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ట్యాంక్‌ బండ్‌ పై నిర్వహించనున్నారు. వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు అమరవీరుల స్థూపం నుంచి భారీ బతుకమ్మ ర్యాలీ చేపట్టి బతుకమ్మ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌ లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సంజయ్ జాజు తెలిపారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.

ఇక తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని నగరం మొత్తం పండగ శోభను సంతరించుకునేలా ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 10 రోజల పాటు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్యాంక్ బండ్‌ పై బతుకమ్మ పండగ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు.

Bathukamma celebrations Here is the schedule for the Bathukamma celebrations from October 10 to 18

మరోవైపు రవీంద్రభారతిలోనూ 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా బతుకమ్మ ప్రత్యేక లోగోను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ లోగోలో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ అంశాన్ని పొందుపరచనున్నారు. అటు ఇప్పటికే తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవులు ఖరారు చేశారు. ఈ నెల 10 నుంచి 22 వరకు మొత్తం 13 రోజులపాటు సెలవులు ఇచ్చారు. ఈ నెల 23న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం స్కూల్స్ లో సమ్మేటివ్‌ అసెస్‌ మెంట్‌ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+