వీసా గడువు ముగిసినా న‌గ‌రంలోనే.. 49 మంది విదేశీయులను గుర్తించిన పోలీసులు..

వీసా గడువు ఎప్పుడో ముగిసినా ఇంకా హైదరాబాద్ మహా నగరంలోనే అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను గుర్తించడానికి హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో 49 మంది విదేశీయులను గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. వారిలో 12 మంది విదేశీయులను ఇప్పటికే వారి స్వదేశాలకు డిపోర్ట్ (దేశం నుండి పంపించి వేయడం) చేశారు. వీరిలో అత్యధికంగా టోలిచౌకీ పరిధిలోనే 30 మంది అక్రమ విదేశీయులు పట్టుబడ్డారు.

ఈ విదేశీయుల వద్ద గంజాయి, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ కరెన్సీ, ఆస్పత్రుల్లో రోగుల దోపిడీ కమిషన్లు, వ్యభిచారం వంటి పలు అక్రమాలు కూడా విదేశీయుల అరెస్ట్ తో బయటపడినట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు విదేశీయులకు ఇళ్లు, గదులను అద్దెకు ఇచ్చే ముందు ఇంటి యజమానులు తప్పనిసరిగా ఫారమ్ సీ నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనరేట్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక విదేశీయులు పట్టుబడిన వివరాలు చూస్తే..

లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు, మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గరు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు, ఇక సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఒకరు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్లంతా విదేశీయుల ఇమ్మిగ్రేషన్ ఉల్లంఘనలతో పాటు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు నకిలీ కరెన్సీ చెలామణి చేస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు విచారణలో గుర్తించారు.

hyderabad Overstaying Foreigners in city despite expired visas Police identify 49 foreign nationals

ఇక వీరిలో ఒకరి నుంచి దాదాపు పావు కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే స్టూడెంట్ వీసాతో వచ్చి ఏళ్ల తరబడి అక్రమంగా నివాసం ఉంటున్న ముగ్గురు సౌత్ సుడాన్ పౌరులకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే టూరిస్ట్ వీసాపై వచ్చిన ఓ కెన్యా మహిళ అక్రమంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. మరికొందరు హైదరాబాద్ కు ట్రీట్ మెంట్ కోసం ఇతర దేశాల నుంచి వచ్చే రోగుల నుంచి అక్రమంగా దండుకుంటున్నట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+