పవిత్ర గోదావరి నదీ తీరంలో టీటీడీ భారీ కార్యక్రమం

పవిత్ర గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకుని రావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత సన్నాహాలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ప్రసిద్ధ గోష్పాద క్షేత్రంలో నవంబరు 16 గోదావరి హారతి మహోత్సవాన్ని నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను టీటీడీ జేఈఓ ప్రభాల గోపినాథ్ ఆవిష్కరించారు. శనివారం తిరుపతిలోని శ్వేతా సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ విశిష్ట కార్యక్రమాన్ని.. టీటీడీ అనుబంధ విభాగం దాససాహిత్య ప్రాజెక్టు, పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. నవంబరు 16న సాయంత్రం 4:30 గంటల నుంచి 7:30 గంటల వరకు సాగే ఈ విశేష హారతి వేడుకల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులను కూడా వేదిక వద్దకు ఉత్సవంగా తీసుకురానున్నారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చే అశేష భక్తులకు స్వామివారి దివ్య దర్శనం లభించనుంది.

TTD set to hold Grand Godavari Harathi at Goshpada Kshetra on November 16 and unveiled a Poster

ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో జల వనరుల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా చేరవేయడమే ఈ హారతి ప్రధాన ధ్యేయమని జేఈఓ ప్రభాల గోపినాథ్ వెల్లడించారు. మానవ మనుగడకు కీలకమైన నీటిని సంరక్షించడం, నదులను పూజించడం మన సనాతన సంస్కృతిలో భాగమని ఆయన గుర్తుచేశారు. ఈ పవిత్ర క్రతువు ద్వారా గోదావరి మాతకు విశేష కర్పూర నైవేద్య హారతులు సమర్పిస్తూ, భక్తులలో పర్యావరణ శుభ్రతపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు.

ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణం, ధ్వజావరోహణం లేకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావాలని, గోదావరి మాతతో పాటు వైకుంఠ వాసుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు. గోష్పాద క్షేత్ర తీరంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+