వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీసీ, ఎస్సీ కుటుంబాలపై కరోనా విలయం- సంపాదించే వారి మృత్యువాత-టాప్ లో ఏపీ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా గతేడాది మార్చిలో మొదలైన కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మరణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కరోనా ఫస్డ్ వేవ్ కంటే సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జనం చనిపోయారు. ఇందులో ప్రధానంగా బలహీన వర్గాలకు చెందిన వారి కుటుంబాల్లో విషాదాలు ఎక్కువగా నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఓబీసీ, ఎస్సీ కుటుంబాల్లో సంపాదించే సభ్యుల్ని కోల్పోయిన ఘటనలు దాదాపు 20 వేలకు పైగానే ఉన్నాయని కేంద్రం తాజా నివేదికల్లో వెల్లడించింది.

 కరోనా మరణమృదంగం

కరోనా మరణమృదంగం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. గతేడాది ఫస్ట్ వేవ్ మొదలైన సమయంలో కేంద్రం అప్రమత్తం చేయడంతో కేసులు ఎక్కువగా ఉన్నా మరణాల సంఖ్య తగ్గింది. కానీ సెకండ్ వేవ్ సమయానికి దేశంలో కేంద్రం చేసిన హెచ్చరికల్ని జనం పెడచెవిన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్దిక వ్యవస్దను గాడిన పెట్టే బిజీలో కరోనా మరణాల్ని లెక్క చేయలేదు. చాలా చోట్ల ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలే తీసుకోవడంతో కరోనా మరణాలు భారీగా నమోదయ్యాయి. ఇందులోనూ బలహీన వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఓబీసీ, ఎస్సీ కుటుంబాలే సమిధలు

ఓబీసీ, ఎస్సీ కుటుంబాలే సమిధలు


దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కరోనా మరణాల్లో బలహీన,వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలే ఎక్కువగా బాధితులుగా మారిపోయాయి. దేశంలోని కరోనా మరణాల్లో ఓబీసీ, ఎస్సీ కుటుంబాల్లోని వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా తేలింది. జాతీయ వెనుకబడిన వర్గాల ఆర్ధికాభివృద్ధి సంస్ధ ఎన్బీసీఎఫ్డీసీతో పాటు జాతీయ షెడ్యూల్ కులాల ఆర్ధికాభివృద్ధి సంస్ధ తాజాగా నిర్వహించిన అధ్యయంలో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. వీటి ప్రకారం చూస్తే బీసీ ఎస్సీ కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులే కరోనాకు ఎక్కువగా బలైనట్లు తేలింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకూ నమోదైన గణాంకాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు.

 12442 బీసీ కుటుంబాల బలి

12442 బీసీ కుటుంబాల బలి


దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకూ ఏకంగా 12442 బీసీ కుటుంబాలు బాధితులుగా మిగిలాయి. ఇందులో ప్రతీ కుటుంబంలోనూ సంపాదించే వ్యక్తులు కరోనాతో మృత్యువాత పడ్డారని జాతీయ వెనుకబడిన కులాల ఆర్ధికాభివృద్ధి సంస్ధ తాజాగా సామాజిక న్యాయశాఖకు ఇచ్చిన నివేదిక తేల్చింది. 0దీంతో ఆయా కుటుంబాల పరిస్ధితి దయనీయంగా మారిపోయింది. ఏపీలో బీసీ కులాలు, మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉన్న కులా0ల వారు కరోనాకు ఎక్కువగా బాధితులైనట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశంలో వెనుక బడిన వర్గాల్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసినట్లు అర్ధమవుతోంది.

7727 ఎస్సీ కుటుంబాలపై ప్రభావం

7727 ఎస్సీ కుటుంబాలపై ప్రభావం

దేశవ్యాప్తంగా 7727 ఎస్సీ కుటుంబాలు కూడా సంపాదించే వ్యక్తుల్ని కరోనా కారణంగా కోల్పోయినట్లు జాతీయ షెడ్యూల్ కులాల ఆర్ధికాభివృద్ధి సంస్ధ కేంద్ర సామాజిక న్యాయ శాఖకు అందించిన గణాంకాల్ని బట్టి తెలుస్తోంది. వీరంతా 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారని నివేదికలు చెప్తున్నాయి. ఆయా కుటుంబాలు తమ సంపాదించే సభ్యుల్ని కోల్పోవడం ద్వారా ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆయా కుటుంబాల్ని ఆదుకునేందుకు బ్యాంకుల సాయం తీసుకుంటున్నట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ చెబుతోంది.

 బాధిత కుటుంబాల్లో ఏపీ టాప్

బాధిత కుటుంబాల్లో ఏపీ టాప్

దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంలో కరోనా కారణంగా సంపాదించే వ్యక్తుల్ని కోల్పోయిన కుటుంబాల జాబితాలో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది. ఇలా సంపాదించే వ్యక్తుల్ని కోల్పోయిన బీసీ కుటుంబాలు ఏపీలో 4948 ఉన్నట్లు వెల్లడైంది. అత్యధిక బీసీ జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో ఇంత భారీ సంఖ్యలో సంపాదించే వ్యక్తులు చనిపోవడం ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఏపీ తర్వాత స్ధానంలో ఉన్న కేరళలో 2100 మంది, గుజరాత్ లో 1934 మంది ఇలా చనిపోయిన వారు ఉన్నారు. అలాగే ఎస్సీ కుటుంబాల జాబితాలోనూ 2106 మందితో ఏపీ టాప్ లో నిలిచింది. ఆ తర్వాత స్ధానంలో గుజరాత్ 1457, మహారాష్ట్ర 836 కుటుంబాలు ఉన్నాయి.

English summary
andhrapradesh on top in obc and sc families lost their earning members to covid 19 with 4948 deaths as india records more than 20000 such incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X