పోలవరంపై కేంద్రం మరో గుడ్ న్యూస్..ఆ రీయింబర్స్ మెంట్ కూ ఓకే...
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ప్రాజెక్టుపై ఖర్చుపెడుతున్న నిధుల రీయింబర్స్ మెంట్ పై ఏపీ సర్కార్ పంపిన ప్రతిపాదనలకు ఒక్కొక్కటిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కేంద్రం ఇవాళ మరో అంశంలోనూ నిధుల రీయింబర్స్ మెంట్ కు అంగీకరించింది. దీనిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏపీకి శుభవార్త చెప్పింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని, తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్ళు మొండికేసిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి అంగీకరించింది.

రాజ్యసభలో ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయానికి సంబంధించిన రూ.55,548 కోట్ల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆ విభాగం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి తుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇప్పటి వరకు కాంపోనెంట్ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ వస్తోంది.
కాంపోనెంట్ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్రం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. సీఎం జగన్ కూడా ఢిల్లీ టూర్లలో ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్ 5న రాసిన లేఖలో స్పష్టం చేసింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications