బెంగళూరుకు చంద్రబాబు - జూ ఎన్టీఆర్ : తారకరత్నకు లోకేశ్ పరామర్శ..!!
తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బెంగుళూరు వెళ్లనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
నందమూరి తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బెంగుళూరు వెళ్లనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీటీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. లోకేశ్ పాదయాత్ర కోసం కుప్పుంకు వచ్చిన తారకరత్న..ఆకస్మికంగా అపస్మార స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను వెంటనే కుప్పంలోని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లకగా గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. వెంటనే పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స ప్రారంభించి యాంజియోగ్రామ్ చేసారు. ఆ సమయంలో లోకేశ్ పాదయాత్ర లో ఉన్నారు. ఆస్పత్రిలోనే ఉన్న బాలకృష్ణ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు చేసారు. చంద్రబాబు..జూ ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్న బాలకృష్ణ తో తారకరత్న ఆరోగ్యం పైన ఆరా తీసారు. ఇక..తొలి రోజు పాదయాత్ర ముగిసిన తరువాత లోకేశ్ ఆస్పత్రికి వెళ్లారు.
ఆస్పత్రిలో లోకేశ్ పరామర్శ
పాదయాత్రలో పాల్గొని అస్వస్థతకు గురై.. కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను లోకేశ్ పరామర్శించారు. చికిత్స వివరాలు, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అర్ద్రరాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. తారకరత్న సతీమణిని పరామర్శించారు. ధైర్యం చెప్పారు.
బెంగళూరు నుంచి వచ్చిన నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్న ను పరీక్షించారు. బెంగుళూరు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా అధునిక వైద్య పరికరాల సపోర్టుతో తారకరత్నను తరలించారు. బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స ప్రారంభించారు. అంబులెన్స్ తో పాటుగా బాలకృష్ణ కూడా బెంగళూరు వెళ్లారు. తారకరత్న సతీమణి.. కుమార్తెలు..కుటుంబ సభ్యులు ప్రస్తుతం బెంగుళూరు ఆస్పత్రిలో ఉన్నారు.

ఆస్పత్రిలో వైద్యులతో బాలయ్య
తారకరత్న కుప్పం ఆస్పత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితి పైనా వాకబు చేసారు. బాలయ్యకు పలు సూచనలు చేసారు. అటు వైద్య ప్రముఖుల నుంచి సలహాలు తీసుకున్నారు. రాత్రి తారకరత్నను బెంగుళూరు తరలించే వరకూ చంద్రబాబు ప్రతీక్షణం తారకరత్న ఆరోగ్యం పైన వాకబు చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నా.. గుండె వాల్వ్ ఒకటి 90 శాతం మూసుకుపోయినట్టు నిర్ధారించారు. తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న భార్య, తల్లితో వైద్యులు మాట్లాడారు. డాక్టర్ ఉదయ్ టీం ప్రస్తుతం తారకరత్నకు వైద్య సేవలు కొనసాగిస్తోంది.

బెంగుళూరుకు చంద్రబాబు - జూ ఎన్టీఆర్..!
తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న చంద్రబాబు ఈ సాయంత్రం బెంగుళూరు వెళ్లనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్తున్నట్లు సమాచారం. నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి..కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి పైన నందమూరి కుటుంబం ఆందోళనలో కనిపిస్తోంది.
బాలకృష్ణ కుటుంబ సభ్యులకు తారకరత్నకు అందిస్తున్న వైద్యం గురించి సమాచారం అందిస్తున్నారు. ఆందోళన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు. మరి కాసేపట్ల తారకరత్న కు అందిస్తున్న వైద్యం..ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ విడుదల కానుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications