అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్చిన చంద్రబాబు - ఎవరెక్కడ..!!

తెలుగుదేశ్ అభ్యర్దుల మార్పు పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా అభ్యర్దుల మార్పు పైన జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్చుతూ నిర్ణయించారు. మరో మూడు నియోజకవర్గాల్లోనూ మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. అనపర్తి సీటు విషయంలోనూ కొత్త ఫార్ములా తెర మీదకు వచ్చింది. పోటీ చేసే అభ్యర్దులకు చంద్రబాబు బీ ఫారంలు ఇచ్చారు. ఎన్నికల పైన కీలక దిశా నిర్దేశం చేసారు.

టీడీపీ అభ్యర్దల మార్పు
టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. చంద్రబాబు తాజా సర్వేల ఆధారంగా అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోటీలో ఉన్న అందరు అభ్యర్దులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి భీపారంలు అందచేయనున్నారు. అభ్యర్దుల మార్పు పైన కొద్ది రోజులుగా పార్టీలో చర్చ జరుగుతోంది. సర్వే నివేదికలు..స్థానిక సమీకరణాల ఆధారంగా ఈ మార్పులు చేస్తూ నిర్ణయించారు. అధికారికంగా ఐదు స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేసారు. ఉండి స్థానం నుంచి ఇప్పటికే ప్రకటించిన రామారాజును తప్పించారు. ఉండి నుంచి టీడీపీలో చేరిన రఘురామ రాజు పేరు ఖరారు చేసారు. ఆయన రేపు (సోమవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Chandra Babu changed contesting candidates in five Assembly Constituencies issues B Forms

ఉండి సీటు రఘురామకే
ఉండి నుంచి రామరాజునే కొనసాగించాలని అక్కడ ఆయన మద్దతు దారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో, రామరాజు నిర్ణయం ఏంటనేది కీలకంగామారుతోంది. అదే విధంగా మాడుగుల అభ్యర్దిని మార్పు చేసారు. అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పేరు ఖరారు చేసారు. పాడేరులో గిడ్డి ఈశ్వరికి సీటు దక్కింది. అక్కడ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగేందుకు ఈశ్వరి సిద్దం అయ్యారు. తాజా మార్పుల్లో ఈశ్వరికి సీటు ఫైనల్ అయింది. మడకశిర స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్నిమార్చారు. అక్కడ తొలుత కురుగొండ రామకృష్ణ కుమార్తెకు సీటు ప్రకటించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తిరిగి సీటును కురుగొండ రామకృష్ణకు కేటాయించారు.

Chandra Babu changed contesting candidates in five Assembly Constituencies issues B Forms

దెందులూరు పెండింగ్
అదే విధంగా దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది . అనపర్తి వ్యవహరంపై క్లారిటీ వచ్చాక దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్ది పోటీలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి అభ్యర్దిగా ఖరారైన రామకృష్ణ రెడ్డి సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజేపీ తమ సీటు వదులుకోవటానికి సిద్దంగా లేదు. దీంతో.. నల్లమిల్లి కురుగొండ రామకృష్ణరెడ్డి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అనపర్తి సీటు టీడీపీకి ఇస్తే తంబళ్లపల్లె లేదా దెందులూరు బీజేపీకి ఇచ్చేలా చర్చ సాగుతోంది. ఈ సీటు పైన ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+