రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా : సీఎం రావాలి - కోటి రూపాయలివ్వాలి : చంద్రబాబు..!!
విజయవాడలో మానసిక విగలాంగురాలిపై అత్యాచర ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటన పైన కుటుంబ సభ్యుల నుంచి ఆరా తీసారు. జరిగిన ఘటన రాష్ట్రానికే అవమానకరమని మండిపడ్డారు. ఈ ఘటనపైన ప్రభుత్వం సిగ్గు పడుతుందో లేదో కానీ, తాను మాత్రం సిగ్గు పడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన సున్నా వడ్డీ పధకం ప్రారంభం కోసం ఒంగోలు వెళ్లారని..ఆయన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేసారు.

సీఎం పరామర్శించాలని డిమాండ్
బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు పట్టించుకోకపోగా.. కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యాచారం చేసిన నిందితులుకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఏపీలో దిశ చట్టం లేదు..దిశ యాప్ లేదు. కేవలం లేనిదాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో ప్రమాదం జరిగితే కోటి రూపాయాల పరిహారం ఇచ్చారని..ఇప్పుడు ఈ ఘటనలో బాధిత కుటుంబానికి సైతం కోటి రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ కు వెళ్లి..ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ప్రభుత్వాస్పత్రి వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితు కుటుంబ సభ్యులు జరిగిన ఘటనకు నిరసనగా ఆందోళనకు దిగారు. వారికి టీడీపీ శ్రేణులు మద్దతు ఇచ్చాయి. చికిత్స కోసం వస్తే కిరాతకంగా అత్యాచారం చేసారని వాపోయారు. ఫిర్యాదు చేసేందుకు నున్న పోలీసు స్టేషన్ కు వెళ్లినా వెంటనే స్పందించకుండా.. అక్కడి సిబ్బంది తమతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, ఇదే ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. విధుల్లో అలసత్వం వహించినందుకు గాను సిఐ హనీష్, సెక్టార్ ఎస్‌ఐ శ్రీనివాసరావులను సీపీ కాంతిరాణాటాటా సస్పెండ్ చేసారు.

ఇద్దరు పోలీసు అధికారులపై వేటు
తాము పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే..పట్టించుకోలేదని బాధిత కుటుంబం చెప్పటంతొ ఈ చర్యలు తీసుకున్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలి కుటుంబసభ్యులతో ఉండగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడకు వెళ్లారు. చంద్రబాబుని చూసిన వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు ఆయన వద్దకు వెళ్లి విలపించారు. ఈ క్రమంలో టీడీపీ నేత పంచుమర్తి అనురాధ, వాసిరెడ్డి పద్మ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications