రఘురామ పోటీపై కీలక మలుపు - ఫైనల్ డెసిషన్..!!

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. పార్టీల అధ్యక్షులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. కూటమి పార్టీల్లోని అభ్యర్దుల్లో కొందరు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. రఘురామ రాజు టీడీపీ నుంచి పోటీకి రంగం సిద్దమైంది. సీటు పైనా స్పష్టత వచ్చింది. గోదావరిలో మారుతున్న లెక్కల సమయంలో ప్రతీ సీటు అన్ని పార్టీల కు కీలకంగా మారుతున్నాయి.

ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో..సీట్ల మార్పు వ్యవహారం పూర్తి చేయాలని కూటమి నేతలు చర్చించారు. గోదావరి జిల్లాల్లో అనపర్తి, ఉండి, దెందులూరుతో పాటుగా అనకాపల్లి, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో సీట్ల మార్పు పైన తుది చర్చలు సాగుతున్నాయి. ఈ రాత్రికి అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో రఘురామ రాజు ఈ నెల 22న నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు చేసారు. పోటీ చేసే స్థానం పైన ఈ రోజు నిర్ణయం వస్తుందని చెబుతున్నారు.

Chandra Babu key decision over Raghu Rama Raju contest to file nomintaion on 22nd

నర్సాపురం ఎంపీ సీటు తమకు ఇస్తే, ప్రత్యామ్నాయంగా ఉండి ఎమ్మెల్యే సీటు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. తాజాగా దెందులూరు సీటు పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తే అక్కక ఇప్పటికే టీడీపీ అభ్యర్ది ఖరారైన రామరాజు భవితవ్యతం ఏంటనేది స్ఫష్టత రావాల్సి ఉంది. రఘురామ పేరు పరిశీలనకు కారణాలను తాజాగా తనను కలిసిన రామరాజుకు చంద్రబాబు వివరించారు. అయితే, రామరాజు వర్గం మాత్రం అభ్యర్దిని మార్చితే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరిస్తోంది. రామరాజుకు మద్దతుగా దీక్షకు దిగిన వారి పైన రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో, తన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు రఘురామ ఉండి నుంచి పోటీ చేస్తారని టీడీపీ ముఖ్య నేతల సమాచారం. ఇప్పటికే అక్కడ సీటు దక్కని కారణంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట శివ రామ రాజు స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రఘురామకు ఉండి సీటు కేటాయిస్తే రామరాజు నిర్ణయం ఏంటనేది కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+