ఎన్నికల వేళ చంద్రబాబు బిగ్ స్కెచ్..!!
ఏపీలో ఎన్నికలు ఈసారి టిడిపికి నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఎన్నికల కోసం చంద్రబాబు చాలాకాలంగా ప్రణాళికలతో సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ బిజెపితో కొత్త విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణలను పక్కగా అమలు చేశారు. కూటమినేతల సభలకు వస్తున్న ప్రజాస్పందనతో చంద్రబాబులో మరింత ధీమా పెరిగింది. పోలింగ్ ముందు చివరి మూడు రోజులు చంద్రబాబు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
గెలుపు పై ధీమా
ఎన్నికల్లో గెలుపు పైన చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన స్పందన పైన మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ వస్తుందని ప్రధాని సైతం కూటమి నేతలతో వ్యాఖ్యానించారు. ప్రధాని తన ప్రచారంలో వైసీపీని టార్గెట్ చేశారు. జగన్ ప్రభుత్వం పై ఆరోపణలు సంధించారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు తమ ప్రచార సభల్లో జగన్ పైన చేస్తున్న ఆరోపణలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో మరింత నమ్మకం పెరుగుతోంది.

ఆపరేషన్ వైసీపీ
కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా చివరి రెండు రోజుల్లో కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ తాను అధికారులకు వచ్చినాక ఎటువంటి మార్పులు తీసుకొస్తాను అనేది చంద్రబాబు ప్రధానంగా తన సభల్లో వివరిస్తున్నారు. ఉపాధి ఉద్యోగాల కల్పన పైన హామీ ఇస్తున్నారు. వైసిపి హయాంలో జరిగిన ల్యాండ్, సాండ్ కుంభకోణాల పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటున్నారు.
కొత్త వ్యూహాలతో
ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మలుచుకునేందుకు చంద్రబాబు పార్టీ నేతలను పదేపదే అలెర్ట్ చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచార తీరు, ఎలక్షన్ నిర్వహణపైన కీలక సూచనలు అందిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులను పరిశీలిస్తుంది. ప్రతిరోజు చంద్రబాబుకి నివేదికలు అందిస్తోంది.
అభ్యర్థులు చేసుకోవలసిన మార్పు చేర్పుల గురించి నాయకత్వం అలర్ట్ చేస్తుంది. ఇక పోలింగ్ కి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో చంద్రబాబు మరింత అప్రమత్తమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులతో టచ్ లోకి వెళ్తున్నారు. కీలక సమయం కావడంతో ఏ రకంగా వ్యవహరించాలనేది దిశా నిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications