లగ్నం పెట్టుకొని రండి - ఎవరేంటో తేల్చుకుందాం : చంద్రబాబు..!!
లగ్నం పెట్టుకొని రండి ..ఎవరేంటో తేల్చుకుందామంటూ చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ చేసారు. గన్నవరం లో ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. పార్టీ పై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నేతలను ఇలాగే వదిలేస్తే గన్నవరం మరో పులివెందులగా మారుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రక్షణకు చేసే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి..తమ పార్టీ వారి పైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలకు..ఆస్తులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని పేర్కొన్నారు. ఒకరు బెదిరిస్తే టీడీపీ పారిపోయే పార్టీ కాదని చెప్పుకొచ్చారు. దొంగ దెబ్బ తీయద్దని..ఎంత మంది వస్తారో రండి అంటూ చంద్రబాబు సవాల్ చేసారు.
గన్నవరంలో ప్రణాళికా బద్దంగానే అధికార పార్టీ దాడులకు పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గన్నవరం లో కూత వేటు దూరంలోనే విమానాశ్రయం ఉందని.. సీఎం నివాసం ఉందని అయినా వైసీపీ నేతలు బరి తెగించారని ఫైర్ అయ్యారు. గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అంటూ చంద్రబాబు నిలదీసారు. తనను గన్నవరం రాకుండా అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 5 లీటర్ల పెట్రోలు పోసి కార్లు దహనం చేసారని చంద్రబాబు పేర్కొన్నారు. మహనీయులు పుట్టిన ప్రాంతంలో సైకోలు చెలరేగుతున్నారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు రూపొందించి ఈ పాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. అరాచకాలను ఎదుర్కోవటానికి తాము సిద్దంగా ఉన్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలీసులు ఏం చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

దొంగ దెబ్బలు తీయద్దని..దొంగాటలు వద్దని చంద్రబాబు పేర్కొన్నారు. లగ్నం పెట్టుకొని రండి..ఎవరెంటే తేల్చుకుందాం అంటూ చంద్రబాబు సవాల్ చేసారు. రాష్ట్ర రక్షణ కోసం చేసే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. వ్యవస్థలకు పట్టిన చీడ పురుగులను నివారించాలని వ్యాఖ్యానించారు. తమతో కలిసి రావాలని..రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గన్నవరం ఘటనపై ఫిర్యాదు చేసినా విచారణ చేయలేదని ఆరోపించారు. ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని చంద్రబాబు సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పద్ధతిగా వ్యవహరించామని, వైఎస్సార్, జగన్ పాదయాత్రలు చేసినా అనుమతించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications