జగన్ పాపాలు పోవాలంటే బెంగళూరు ప్యాలెస్ లో కాదు ఉండాల్సింది, చంద్రబాబు

భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జగన్ సుమారు పది లక్షల కోట్ల రూపాయాలు అప్పులు చేశాడని, చివరికి ప్రజలు ఛీకొట్టడంతో అధికారం నుంచి దిగి వెళ్లిపోయారని, కనీసం ఇప్పుడు వరద బాదితులను ఆదుకోవడానికి జగన్ కు కనీసం మనుసు కూడా రావడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

సోమవారం సాయంత్రం విజయవాడలో ని కబేళా సెంటర్ పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. తనతో పాటు మంత్రులు, ప్రభుత్వ అధికారులు అందరూ గత 9 రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో బురదలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

Chandrababu accused Jagan of doing dirty politics while sitting in Bengaluru Palace

వరదపీడిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న బాదలు వర్ణణాతీతం అని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వరద నీరును తరలించడానికి, రోడ్లు, డ్రైనేజ్ లు శుభ్రం చెయ్యడానికి, విద్యుత్ సరఫరా చెయ్యడానికి, వరద బాదితులకు ఆహారం, మంచినీరు అందించడానికి మంత్రులు, అధికారులు, సిబ్బంది పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేమని, అందరూ కష్టపడి పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

పగలు, రాత్రి అని తేడా లేకుండా తనతో పాటు మంత్రులు, అధికారులు బురదలోనే తిరుగుతూ ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంటే బెంగళూరు ప్యాలెస్ లో కుర్చున్న మాజీ సీఎం జగన్ మాపై బురద జల్లుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తోపాటు వైసీపీ నాయకులు మాపైన చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు ప్రజల మద్య ఉన్నారు, ఎవరు ప్యాలెస్ లో ఉన్నారు అని ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.

విజయవాడతో పాటు వరదపీడిత ప్రాంతాల్లో జగన్ తిరిగి ప్రజలకు కొంచెం అయినా సేవ చేసి ఉంటే అతను చేసిన పాపాలు కొనంని అయినా పోయేవని, కానీ వాళ్లు అలా చెయ్యలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే బెంగళూరులో కుర్చుని బురదరాజకీయాలు చెయ్యడం సరికాదని, ప్రజల మద్యకు వచ్చి వారు అడిగే ప్రశ్నలకు జగన్ తో పాటు వైసీపీ నాయాకులు సమాదానం చెప్పాలని చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు సవాలు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+