Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు- ప‌వ‌న్: "తెర‌"పైకి ర‌ఘురామ- టార్గెట్ జ‌గ‌న్ : భ‌విష్య‌త్ బంధాల‌కు నాంది..!

తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతులు త‌ల‌పెట్టిన బ‌హిరంగ స‌భ‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. బైపాస్ రోడ్డు మార్గంలో ట‌యోటా షోరూం స‌మీపంలోని ఒక‌ ప్ర‌యివేటు స్థ‌లంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ స‌భకు అన్నిపార్టీల ఆగ్ర‌నేత‌లు హాజర‌య్యే అవ‌కాశం ఉంది. వీరితో పాటు అమ‌రావ‌తి రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌జా సంఘాలు, ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వ‌ర‌కూ స‌భ నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది.

 ష‌ర‌తుల‌తో స‌భ‌కు హైకోర్టు అనుమ‌తి

ష‌ర‌తుల‌తో స‌భ‌కు హైకోర్టు అనుమ‌తి

అమ‌రావ‌తి రైతుల త‌ల‌పెట్టిన‌ బ‌హిరంగ స‌భ‌కు తొలుత తిరుప‌తి పోలీసులు తిర‌స్క‌రించారు. దీంతో రైతులు ఏపీ హైర్టును ఆశ్ర‌యించారు. కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చింది. కోర్టు అనుమ‌తి ఇవ్వడంతో బ‌హిరంగ స‌భ‌కు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి అవ‌స‌రాన్ని వివ‌రించ‌డానికి ఈ స‌భను వేదిక‌గా చేసుకున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు స‌భ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంట‌ల క‌ల్లా స‌భ ముగించాల‌ని కోర్టు ఆదేశించినందున 5 గంట‌ల‌కే ముగించాల‌ని అమరావాతి జేఏసీ భావిస్తోంది.

రైతుల స‌భ‌కు రాజ‌కీయ పార్టీల నేత‌లు

రైతుల స‌భ‌కు రాజ‌కీయ పార్టీల నేత‌లు

ఈ బ‌హిరంగ స‌భ‌కు తొలి నుంచి అమ‌రావ‌తి రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన రాజ‌కీయ పార్టీల నేత‌లు హాజ‌రుకానున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ,క‌న్నా ల‌క్ష్మీణారాయ‌ణ‌, సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శిన నారాయ‌ణ‌, కాంగ్రెస్ , సీపీఎం , సీపీఐ రాష్ట్ర నేత‌లు హాజ‌రుకానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వ‌స్తున్నందున్న చుట్టుప‌క్క‌ల జిల్లాల నుంచి తెలుగు త‌మ్ముళ్లు భారీగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అటు జ‌న‌సేన అధినేత‌, హీరో ప‌వ‌న్ వ‌స్తే అభిమానుల‌తో పాటు జ‌న సైనికులు స‌భ‌కు పోటెత్తే అవ‌కాశం ఉంది.

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మ‌ద్ద‌తు.. స‌భ‌కు వ‌స్తారా.?

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మ‌ద్ద‌తు.. స‌భ‌కు వ‌స్తారా.?


మ‌రోవైపు రాజ‌ధాని రైతుల‌కు వైసీపీ నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు తొలి నుంచి వారికి స‌పోర్టుగా నిలిచారు. ఈ స‌భ‌కు హాజ‌రుకావాల‌ని జేఏసీ నేత‌లు ఆయ‌న‌ను కోరారు. ర‌ఘురామ‌కృష్ణంరాజు ప్ర‌సంగం వినేందుకు జ‌నం ఆస‌క్తి చూపుతున్నారు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా రఘురామ‌రాజు రాష్ట్రంలో అడుగుపెట్టింది లేదు. ఢిల్లీలో ఉంటూనే త‌న వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే రైతుల తిరుప‌తి స‌భ‌కు వ‌స్తారా.. రారా అన్న‌ది సస్పెన్స్ నెల‌కొంది. ఒక‌వేళ స‌భ‌కు హాజ‌రుకాని ప‌క్షంలో వ‌ర్చువ‌ల్‌గా పాల్గొనే అవ‌కాశం ఉందని త‌న అనుచ‌రులు వెల్ల‌డించారు.

 రైతుల పాద‌యాత్ర‌కు ముగింపు

రైతుల పాద‌యాత్ర‌కు ముగింపు


సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌టించిన నాటి నుంచి అమ‌రావ‌తే రాజ‌ధానిగా కొన‌సాగాల‌ని రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌ర‌రావ‌తి సాధ‌న కోసం రైతులు న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పాద‌యాత్ర చేశారు. న‌వంబ‌ర్ 1న తుళ్లూరు నుంచి పాద‌యాత్ర ప్రారంభించి బుధ‌వారం తిరుమ‌ల చేరుకుని శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. నాలుగు జిల్లాల మీదుగా సుమారు 5 వంద‌ల కిలోమీట‌ర్ల మేర వారి పాద‌యాత్ర సాగింది. తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి పాద‌యాత్ర‌ను రైతులు ముగించ‌నున్నారు..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+