చంద్రబాబు - సాయిరెడ్డి మధ్య బంధుత్వం : ఇదీ బంధం - బయటపెట్టిన వైసీపీ ముఖ్యనేత..!!
ఏపీ రాజకీయాల్లో నిత్యం వైసీపీ - టీడీపీ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా వైసీపీ ముఖ్య నేత..ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ప్రతీ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పైన విమర్శలు చేస్తూనే ఉంటారు. ట్వీట్ల ద్వారా చంద్రబాబు - లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ విరుచుకుపడుతున్నారు. అటు టీడీపీ నేతలు సైతం విజయ సాయిరెడ్డి పైన అదే స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే, ఆశ్యర్యకరమైన విషయం ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు - విజయ సాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉంది.

చంద్రబాబు - సాయిరెడ్డి బంధుత్వం
ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు - ప్రత్యారోపణల నడుమ కంపెనీలు - పెట్టుబడులు - వాటాలు..సంబంధాల పైన కొత్త చర్చలు తెర మీదకు వస్తున్నాయి. అందులో భాగంగా.. ఆడాన్ కంపెనీ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం పైన విజయ సాయిరెడ్డి స్పందించారు. తమ కుటుంబానికి ఆడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేయటం పైన మండిపడ్డారు. ఒక కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి మరో సంస్థలోనూ డైరెక్టర్ గా ఉండటం గుర్తించాలన్నారు. ముత్తురాజు విజయకుమార్‌కు సత్యం కంపెనీతో సంబంధం ఉందని చెబుతూ.. అదే ముత్తురాజుకు చంద్రబాబుకు చెందిన కంపెనీలతో సంబంధం ఉందన్నారు.

సాయిరెడ్డికి చంద్రబాబు అన్న అవుతారు
ఈ పరిస్థితుల్లో సత్యం కంపెనీతో మీకు సంబంధం ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించారు. తమ పైన బురద జల్లేందుకు ప్రయత్నించటం మానుకోవాలని సాయిరెడ్డి హెచ్చరించారు. ఇక, తనకు చంద్రబాబుతో ఉన్న బంధుత్వాన్ని సాయిరెడ్డి బయట పెట్టారు. చంద్రబాబు వరుసకు సాయిరెడ్డికి అన్న అవుతారని స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ మనవుడు అయిన తారకరత్నతో తన భార్య సోదరి కూతురి వివాహం జరిగిందన్నారు. దీని ద్వారా తమ మధ్య బంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనకు బంధువు కావటం వలన తన ఆస్తులన్నీ చంద్రబాబుకు.. ఆయన ఆస్తులన్నీ తనకు దక్కుతాయా అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.

కంపెనీల్లో పెట్టుబడులు - సంబంధాల పై
చంద్రబాబు బంధువు అవ్వటంతో హెరిటేజ్ తనది అయిపోతుందా అంటూ నిలదీసారు. ఈ రిలేషన్ తో అరబిందో - హెరిటేజ్ ఒక్కటయిపోతాయా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. నారా బ్రాహ్మణి 15 కంపెనీల్లో .. భువనేశ్వరి దాదాపు 18 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చెప్పే లాజిక్ కు అర్దం లేదని వివరించారు. 16 కంపెనీల నుంచి 20 కంపెనీల్లో చంద్రబాబు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉంటే వాటన్నింటికీ రిజిస్టర్డ్ కార్యాలయం ఒక్కటేనని సాయిరెడ్డి చెప్పారు. కామన్ డైరెక్టర్ ఉంటే ఆ కంపెనీ సొంతం అవుతుందా అని ప్రశ్నించారు. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవని సాయిరెడ్డి స్పష్టం చేసారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications