కూకట్‌పల్లిలో చంద్రబాబు: కాళహస్తిలో పురంధేశ్వరి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆస్పత్రిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చిన చంద్రబాబు జ్యోతిప్రజ్వలను చేశారు.
ఆస్పత్రిలో సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు అక్కడకు చేరుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

ఇదిలావుంటే, బిజెపి రాజంపేట పార్లమెంట్ సీటు అభ్యర్థి పురందేశ్వరి గురువారం శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. వేదపండితులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం గురుదక్షణామూర్తి సన్నిధిలో పండితులు ఆశీర్వచ నం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రావాలని ముక్కంటిని ప్రార్ధించానని పురందేశ్వరి చెప్పారు. అనూహ్యంగా పురంధేశ్వరి కాంగ్రెసుకు రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. అంతేకాకుండా విశాఖపట్నం సిట్టింగ్ స్థానాన్ని వదిలేసి రాయలసీమలోని రాజంపేట లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు.












Click it and Unblock the Notifications