'రూ.7 కోట్ల లోన్‌తో చంద్రబాబు ఇల్లు కట్టారు, జగన్ ఇల్లు చూడండి'

హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న ఇంటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ బుధవారం స్పందించారు.

విజయవాడ: హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న ఇంటిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ బుధవారం స్పందించారు.

ఆ ఇంటిని చంద్రబాబు అప్పు తీసుకొని కట్టారని తెలిపారు. రూ.7 కోట్ల బ్యాంకు లోన్‌ తీసుకుని భువనేశ్వరి, లోకేశ్‌ ఇల్లు కట్టుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో అవాస్తవాలు ప్రసారం చేయొద్దని విజ్ఢప్తి చేశారు.

Chandrababu build resident with Rs 7 crore loan from banks

చంద్రబాబు ఇంటిపై విమర్శలు గుప్పించేవారు మొదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిని చూడాలని, ఆ తర్వాత మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై, ప్రత్యేక హోదా అంశంపై వైసిపి చేసే ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

కాగా, చంద్రబాబు హైదరాబాదులో కొత్తగా ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ ఇంటిని రూ.10 కోట్లతో చంద్రబాబు నిర్మించారు. ఇందులో రూ.7 కోట్లు లోన్ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+