ఆ మంత్రిపై కార్టూన్ వీడియో వదిలిన అంబటి.. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అంటూ..

కేసులు పెడితే మైలేజ్‌ రాదని.. తాను కేసులకు భయపడనని.. ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడితే మరి తనపై.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై వీడియోలు, పోస్టులు పెడుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

తనకు నచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తా : అంబటి రాంబాబు

ఏఐ వీడియోలు రిలీజ్‌ చేస్తున్నా వారిపై కేసులు నమోదు చేయరా? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోపై ఏపీ పోలీసులు సీఐడీ కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదుపై తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు నచ్చిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని స్పష్టం చేశారు.

Ex Minister Ambati Rambabu fires on CID Case Filed For his post on Pemmasani Chandrasekhar

తన ఇంటిపైన దాడిలో తననే అరెస్ట్ చేస్తారా?

పెమ్మసాని చంద్రశేఖర్‌పై 'ఎక్స్‌'లో పోస్ట్ చేసిన వీడియో అసభ్యకరం కాదని.. పొలిటికల్ కార్టూన్ అని వివరించారు. దీనిపై కేసు నమోదు అయినట్లు తనకు తెలియదని... అయినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.తన ఇంటిపై దాడి జరిగితే తననే అరెస్ట్ చేయడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుట్ర ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

పెమ్మసాని చంద్రశేఖర్ వల్లే తనను పోలీసులు హింసించే యత్నం

కేంద్రమంత్రి చంద్రశేఖర్ నేరస్తుడు. నా అరెస్ట్ వెనుక ఆయన కుట్ర ఉంది. ఆయనే నా ఇంటిపై దాడి చేయించారు అని ఆరోపణలు చేశారు. తనను పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్లిన తర్వాత ఫోన్లు చేసి తనను హింసించాలని పోలీసులకు కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ చెప్పినట్లు సంచలన విషయాలు తెలిపారు.కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అండతోనే తనను హింసించే ప్రయత్నం చేశారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు.

తాను ఉద్యమం చేస్తున్నానన్న అంబటి రాంబాబు

కేంద్రమంత్రి అయినా, ఎవరైనా సరే చట్టవ్యతిరేకంగా పని చేశారని.. దానిపై విచారణ జరపాలని తాను కోరినట్లు చెప్పారు. అయితే విచారణ చేయకపోవడంతోనే తాను ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే పెమ్మసాని చంద్రశేఖర్‌ను చట్టప్రకారం శిక్షించాల్సిందేనని.. తన అభియోగాలపై విచారణ చేయాల్సిందేనని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

మమ్మల్ని ట్రోల్ చేసే వీడియోలపై కేసులు పెట్టరా?

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన.. మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిపై వీడియోలు, పోస్టులు పెడుతున్నా కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మా అందరినీ ట్రోల్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏఐ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరి కేసులు పెట్టారా? అని నిలదీశారు. చంద్రశేఖర్‌పై ఆ వీడియోలను నేను క్రియేట్ చేశా. నాకు ఎవరూ పంపించలేదు.

తానేమైనా మర్డర్లు, స్కాములు, దోపిడీలు చేశానా?

ఆ వీడియో, కార్టూన్‌పై నాకు బాధ్యత ఉంది అని స్పష్టం చేశారు. కేసులు పెడితే మైలేజ్ రాదని కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. తానేమైనా మర్డర్లు, స్కాములు, దోపిడీలు చేశానా? ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..వారికే పదవులు.. కాంగ్రెస్ డెడ్ లైన్ అప్పటివరకే!
నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..వారికే పదవులు.. కాంగ్రెస్ డెడ్ లైన్ అప్పటివరకే!

పెమ్మసానిపై అంబటి రాంబాబు పోరాటం

తన ఇంటిపై దాడి సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్‌ చేయగా.. ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పెమ్మసానిపై అంబటి రాంబాబు పోరాటం మొదలుపెట్టారు. పెమ్మసాని కారణంగానే తన అరెస్ట్‌ జరిగిందని.. హింసించే ప్రయత్నాలు చేశారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు ఉన్న ఓ ఏఐ వీడియో 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కించపరిచేలా ఉందని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీజీపీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు మద్దిరాల మ్యానీ ఫిర్యాదు చేయగా.. సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+